Compact SUVs With Highest Boot Space: భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUVలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సబ్-4 మీటర్ పరిమితిలో ఉండటం వల్ల డిజైన్, క్యాబిన్ స్పేస్‌తో పాటు బూట్ కెపాసిటీ విషయంలో కొన్ని సహజమైన పరిమితులు ఉంటాయి. మిడ్‌సైజ్ SUVలతో పోలిస్తే వీటి బూట్‌లు తక్కువే. అయినప్పటికీ, రోజువారీ వినియోగం, చిన్న ప్రయాణాలు, కుటుంబ అవసరాలకు సరిపడే బూట్ స్పేస్ ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి.
వెనుక సీట్లు మడవకుండా, బూట్ ఫ్లోర్ నుంచి పార్సెల్ ట్రే వరకు కొలిచిన బూట్ కెపాసిటీ ఆధారంగా కాంపాక్ట్ SUVలకు ర్యాంక్‌లు ఇచ్చాం. తక్కువ బూట్ నుంచి ఎక్కువ బూట్ వరకు - టాప్-9 లిస్ట్ ఇదిగో...
Mahindra XUV 3XO – 295 లీటర్లు
ఈ జాబితాలో అతి చిన్న బూట్ XUV 3XOదే. కేవలం 295 లీటర్లు మాత్రమే ఉండటం వల్ల పెద్ద బ్యాగులు పెట్టుకోవడం కష్టమే. పైగా సైడ్ ఇంట్రూజన్లు ఎక్కువగా ఉండటంతో ఉపయోగం మరింత తగ్గుతుంది. లోడింగ్ లిప్ ఎక్కువగా ఉండటం కూడా ఇబ్బందిగా మారుతుంది.
Maruti Suzuki Fronx / Toyota Urban Cruiser Taisor – 308 లీటర్లు
ఈ రెండింటికీ ఒకే స్థాయి బూట్ స్పేస్ ఉంది. 308 లీటర్లు చిన్న కుటుంబ అవసరాలకు సరిపోతుంది. అయితే స్లోపింగ్ రూఫ్, ఎత్తైన సిల్ కారణంగా బరువైన లగేజ్ ఎక్కించడం కొంత కష్టమే.
Maruti Suzuki Brezza – 328 లీటర్లు
Brezza బూట్ వెడల్పైన ఓపెనింగ్, స్క్వేర్ ఆకారం వల్ల బాగా ఉపయోగపడుతుంది. 328 లీటర్ల స్పేస్ వల్ల, ప్రయాణానికి ముందు పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉండదు.
Nissan Magnite / Renault Kiger – 336 లీటర్లు
ఈ రెండు మోడల్స్‌లో 336 లీటర్ల బూట్ ఉంది. ఆకృతి బాగుండటంతో రెండు పెద్ద ట్రావెల్ బ్యాగులు సులభంగా పడతాయి. లోతు, వెడల్పు మంచి స్థాయిలో ఉంటాయి.
Tata Nexon – సుమారు 350 లీటర్లు
Nexon బూట్‌లో హుక్స్, బూట్ లైట్, 12V సాకెట్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. అయితే వీల్ ఆర్చ్ ఇంట్రూజన్ల కారణంగా వెడల్పు లగేజ్‌కు కొంత అడ్డంకి ఉంటుంది.
Skoda Kylaq – 360 లీటర్లు
360 లీటర్ల బూట్‌తో Kylaq మంచి ప్రాక్టికాలిటీ ఇస్తుంది. స్క్వేర్ షేప్, సరైన డెప్త్ వల్ల లోడింగ్ సులువుగా ఉంటుంది. పార్సెల్ ట్రే స్టోరేజ్ స్లాట్ అదనపు ప్లస్.
Hyundai Venue – 375 లీటర్లు
Venue బూట్ 375 లీటర్లు ఉండటం విశేషం. XUV 3XOతో పోలిస్తే ఇది దాదాపు 80 లీటర్లు ఎక్కువ. లోతైన ఫ్లోర్ వల్ల పొడవైన వస్తువులు పెట్టుకోవచ్చు. కానీ లోడింగ్ లిప్ కొంచెం ఎక్కువ.
Kia Sonet – 385 లీటర్లు
Sonet బూట్ వెడల్పైన ఓపెనింగ్‌తో వస్తుంది. 385 లీటర్ల స్పేస్‌తో వీకెండ్ ట్రిప్ లగేజ్ సులభంగా సరిపోతుంది.
Kia Syros – 390 లీటర్లు
ఈ సెగ్మెంట్‌లో అతి పెద్ద బూట్ Kia Syrosదే. 390 లీటర్ల బూట్‌తో పాటు స్లైడ్ అయ్యే రెండో వరుస సీట్లు ఉండటం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఫ్లోర్ తక్కువగా ఉండటం వల్ల పెద్ద బ్యాగులను నిటారుగా పెట్టుకోవచ్చు.
కాంపాక్ట్ SUV కొనుగోలు సమయంలో మైలేజ్, ఫీచర్లు మాత్రమే కాకుండా బూట్ స్పేస్ కూడా కీలక అంశం. ఈ పోలిక చూసుకుంటే, ఎక్కువ లగేజ్ అవసరం ఉన్నవారికి Kia Syros, Sonet లాంటి మోడల్స్ మంచి ఎంపికగా నిలుస్తాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.