Triumph New Motorcycle: భారత మార్కెట్‌లో Triumph 400cc సిరీస్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రయాణాన్ని ఆరంభించిన మోడల్‌ Speed 400. ఇందులో KTM ఆధారిత 398cc ఇంజిన్‌ను Triumph తన స్టైల్‌కు తగ్గట్టు రీ-వర్క్‌ చేసింది. తర్వాత Scrambler 400 X, Thruxton 400 వంటి మోడళ్లు వచ్చాయి. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి కొత్తగా Tracker 400ను Triumph గ్లోబల్‌ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే Speed 400తో పోలిస్తే Tracker 400లో ఏం మారింది?.

Continues below advertisement

డిజైన్‌ – ఇక్కడే అసలు తేడా

ఈ రెండు బైక్‌ల మధ్య కనిపించే పెద్ద తేడా డిజైన్‌.

Continues below advertisement

Speed 400 ఒక నియో-రెట్రో రోడ్‌స్టర్‌ లుక్‌తో వస్తుంది.

Tracker 400 మాత్రం ఫ్లాట్‌ ట్రాక్‌ ఇన్‌స్పిరేషన్‌తో రగ్గడ్‌ లుక్‌లో ఉంటుంది.

ముందు భాగంలో రెండు బైక్‌లకు హెడ్‌ల్యాంప్‌ ఒకటే అయినా, Tracker 400కి టింటెడ్‌ ఫ్లై స్క్రీన్‌ ఇచ్చారు. ఇది Scrambler 400 XCలో ఉన్నదానికంటే చిన్నది, స్క్వేర్‌ ఆకారంలో ఉంటుంది. 

Speed 400లో గోల్డ్‌ ఫినిష్‌ USD ఫోర్క్‌, Tracker 400లో మాత్రం బ్లాక్‌ USD ఫోర్క్‌ ఉంటుంది.

ఫ్యూయల్‌ ట్యాంక్‌, సైడ్‌ ప్యానెల్‌

Tracker 400 ఫ్యూయల్‌ ట్యాంక్‌కి లోతైన కట్‌ అవుట్స్‌ ఇచ్చారు. Speed 400 ట్యాంక్‌ మాత్రం స్మూత్‌, రౌండెడ్‌ డిజైన్‌లో ఉంటుంది. 

Tracker 400 సైడ్‌ ప్యానెల్‌ పూర్తిగా బ్లాక్‌ అవుట్‌ చేసిన డిజైన్‌లో వస్తే, Speed 400లో అక్కడ స్పీడ్‌ 400 బ్యాడ్జింగ్‌ ఉంటుంది. అదనంగా Trackerలో ‘400’ బ్యాడ్జ్‌తో స్క్వేర్‌ ప్లాక్‌ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

సీట్‌, రియర్‌ డిజైన్‌

Speed 400 సీట్‌ డిజైన్‌ Speed T4, Scrambler మోడళ్లతో ఒకేలా ఉంటుంది. వెనుక కూర్చునే వ్యక్తికి చిన్న స్టెప్‌ ఉంటుంది. 

Tracker 400లో మాత్రం Thruxton 400 ఆధారిత ఫ్లాట్‌ సీట్‌ ఇస్తారు. దీనికి రిమూవబుల్‌ కౌల్‌ ఉండడం ప్రత్యేకత. కావాలంటే పిలియన్‌ సీట్‌గా మార్చుకోవచ్చు.

రియర్‌ లుక్‌లో కూడా తేడా

Speed 400లో 3D టెయిల్‌ల్యాంప్‌

Tracker 400లో సింపుల్‌ రెక్టాంగ్యులర్‌ టెయిల్‌ల్యాంప్‌

ఇంజిన్‌, పవర్‌ డెలివరీ

ఈ రెండు బైక్‌ల్లోనూ 398cc TR సిరీస్‌ ఇంజిన్‌ ఉంటుంది. కానీ ట్యూనింగ్‌లో తేడా ఉంది.

Tracker 400: 42hp పవర్‌, 37.5Nm టార్క్‌

Speed 400 కంటే 2hp ఎక్కువ పవర్‌ Trackerలో ఉంటుంది

పవర్‌, టార్క్‌ రెండూ Tracker 400లో 1,000rpm ఎక్కువ వద్ద డెలివర్‌ అవుతాయి. Tracker 400లో Scrambler 400 తరహా డ్యూయల్‌ బ్యారెల్‌ ఎగ్జాస్ట్‌ ఉంటుంది.

హ్యాండిల్‌బార్‌, డైమెన్షన్స్‌

Speed 400 హ్యాండిల్‌బార్‌ వెడల్పు 814 మి.మీ.

Tracker 400 కోసం మరో 43 మి.మీ. ఎక్కువ వెడల్పు ఉన్న హ్యాండిల్‌బార్‌ ఇచ్చారు.

Tracker సీట్‌ హైట్‌ 805 మి.మీ, ఇది Speed కంటే 15 మి.మీ ఎక్కువ. అయినా చాలా మందికి రైడర్లకు కంఫర్ట్‌గానే ఉంటుంది. 

వీల్‌బేస్‌ 6 మి.మీ. తక్కువగా, రేక్‌ యాంగిల్‌ కొంచెం షార్ప్‌గా ఉంటుంది.

Speed 400 కంటే Tracker 400 మోటార్‌సైకిల్‌ 3 కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది.

Speed 400 మీకు సిటీ రైడింగ్‌, రోజువారీ వినియోగానికి సరైన ఎంపిక అయితే; Tracker 400 మాత్రం స్టైల్‌తో పాటు రగ్గడ్‌ క్యారెక్టర్‌ కోరుకునే రైడర్ల కోసం సూటవుతుంది. రెండూ ఒకే కుటుంబానికి చెందిన బైక్‌లే అయినా, పర్సనాలిటీ మాత్రం పూర్తిగా వేరు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.