CNG Car Mileage Tips:రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న సీఎన్జీ ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే మీ డ్రైవింగ్ శైలిలో, కారు నిర్వహణలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే ప్రతి గ్యాస్‌ను భారీగా ఆదా చేయవచ్చు. గరిష్ట మైలేజీని పొందవచ్చు. 

Continues below advertisement

క్రమం తప్పకుండా సర్వీసింగ్‌

కారు మైలేజీ అనేది ముఖ్యంగా ఇంజిన్ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. మీ కారు ఇంజిన్ ఎంత సమర్థవంతంగా పని చేస్తే, ఇంధన వినియోగం అంత తక్కువగా ఉంటుంది. 

Read Also: BYD DMi Super PlugIn Hybrid Technology: బీవైడీ డీఎమ్-ఐ హైబ్రిడ్ టెక్నాలజీ టీజర్ రిలీజ్ - అదిరిపోయే రేంజ్, ఫీచ‌ర్లు  

Continues below advertisement

దీని కోసం కారును క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయాలి. ముఖ్యంగా స్పార్క్ ప్లగ్స్‌, ఎయిర్‌ఫిల్టర్స్‌, ఫ్యూయల్‌ ఫిల్టర్లు, ఇంజెక్టర్లు షెడ్యూల్‌ ప్రకారం చెక్ చేయించి, అవసరమైతే క్లీన్‌ చేయించాలి. 

ఇంజిన్ ఆరోగ్యంగా లేకపోతే అది ఇంధనాన్ని కంజ్యూమ్ చేయలేదు. దీని వల్ల మైలేజీ భయంకరంగా పడిపోతుంది. తయారీదారు సూచించిన కిలోమీటర్ల పరిమితి దాటక ముందే సర్వీసింగ్ పూర్తి చేయాలి. అధికారిక సర్వీసింగ్ సెంటర్లలో ప్రొఫెషనల్‌ మెకానిక్‌ల ద్వారా ఇంజిన్ ట్యూనింగ్ చేయించడం వల్ల సీఎన్జీ కిట్‌ పని తీరు మెరుగుపడుతుంది. 

టైర్లలో సరైన గాలి మెయింటైన్ చేయడం 

చాలా మంది వాహనదారులు టైర్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ మైలేజీపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కారు టైర్లలో ఎల్లప్పుడూ తయారీదారు సూచించిన స్థాయిలో గాలి ఒత్తిడి ఉండేలా చూసుకోవాలి. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు, టైర్లు రోడ్లు మధ్య ఘర్షణ పెరుగుతుంది. దీని వల్ల ఇంజిన్ కారును ముందుకు నడపడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. 

Read Also: MG Majestor SUV Launched: ఎమ్జీ మెజస్టర్ ఎస్‌యూవీ లాంచ్: టయోటా ఫార్చూనర్‌కు గట్టి పోటీగా వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్..

కనీసం వారానికి ఒకసారి లేదా సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్లే ముందు టైర్‌ ప్రెజర్‌ చెక్ చేయాలి. డిజిటల్ ప్రెజర్‌ గేజ్ ఉపయోగించి లేదా పెట్రోల్ బంకుల్లో లభించే ఎయిర్‌ ఫిల్లింగ్ పాయింట్ల వద్ద కచ్చితమైన రీడింగ్ తీసుకోవాలి. 

స్మూత్ డ్రైవింగ్ హ్యాబిట్స్ 

మీరు కారును నడిపిన విధానమే మీ మైలేజీని నిర్ణయిస్తుంది. దూకుడా డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధనం వృథా అవుతుంది. కారును వేగంగా స్టార్ట్ చేయడం, ఒక్కసారిగా బ్రేకు వేయడం నివారించాలి. వేగ పరిమితిని మించి డ్రైవింగ్ చేయడం, తరచుగా గేర్లు మార్చడం వల్ల సీఎన్జీ వినియోగం పెరుగుతుంది. స్థిరమైన వేగంతో నడపడం వల్ల మైలేజీని గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. 

ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, హైవేలపై క్రూయిజ్ స్పీడ్‌ను నిర్వహించడం అలవాటు చేసుకోవాలి. క్లచ్‌ను అవసరమైనప్పుడే వాడం, సరైన వేగంలో సరైన గేర్‌ను ఉపయోగించడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచవచ్చు. 

అనవసరమైన బరువు తగ్గించడం 

కారు ఎంత తేలికగా ఉంటే, మైలేజీ అంత ఎక్కువగా ఉంటుంది. కారు డిక్కీలో ఉన్న పనికి రాని వస్తువులను, భారీ లోడ్లను తొలగించాలి. కారు బరువు పెరిగే కొద్దీ, దాని లాగడానికి ఇంజిన్ మరింత శక్తిని వెచ్చించాల్సి వస్తుంది. ఇది నేరుగా ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతుంది. సుదీర్ఘ ప్రయాణాలకు ప్లాన్ చేసినప్పుడు కారులో కేవలం అవసరమైన సామాగ్రిని మాత్రమే ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా కారును శుభ్రం చేస్తూ, అవసరం లేని యాక్సెసరీలను తీసివేయడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. 

నాణ్యమైన సీఎన్జీ, జాగ్రత్తలు

ఇంధనం నాణ్యత, పార్కింగ్ విధానం కూడా మైలేజీని ప్రభావితం చేస్తాయి. ఎల్లప్పుడూ విశ్వసనీయమైన, గుర్తింపు పొందిన సీఎన్జీ స్టేషన్ల నుంచే గ్యాస్ నింపుకోవాలి. తక్కువ నాణ్యత గల ఇంధనం ఇంజిన్ పనితీరును దెబ్బతీయడమే కాకుండా, కారు మైలేజీని కూడా తగ్గిస్తుంది. కారును ఎక్కువ సేపు ఎండలో ఉంచకుండా చూసుకోవాలి. నీడ ఉన్న చోట పార్కింగ్ చేయడం, క్రమం తప్పకుండా నిర్వహణ షెడ్యూల్‌ను పాటించడం వల్ల కారు ఎక్కువ కాలం మంచి మైలేజీని ఇస్తుంది. 

సీఎన్జీ పెరుగుతున్నప్పటికీ పైన పేర్కొన్న ఐదు చిట్కాలు పాటించడం ద్వారా మీ ప్రయాణ ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు. సరైన నిర్వహణ, క్రమశిక్షణతో కూడిన డ్రైవింగ్ మీ కారుకు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని, మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తాయి.