BYD India Teases DMi Super PlugIn Hybrid Technology: ఇండియాలో కేవలం ప్యూర్ ఎలెక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయిస్తున్న ప్రముఖ గ్లోబల్ బ్రాండ్ బీవైడీ (BYD) సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. దేశీయ మార్కెట్లో తన మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఈవీ (PHEV) మోడళ్లను లాంచ్ చేయడానికి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ సోషల్ మీడియా ఛానెళ్లలో "BYD DM-i", "Super Plug-in Hybrid EV" పేరుతో ఒక ఇంట్రెస్టింగ్ టీజర్‌ను షేర్ చేసింది. ఇటీవల కాలంలో బీవైడీ సీలియన్ 6, అట్టో 2 క్రాస్ఓవర్ మోడళ్లు ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొన్ని రోజులకే ఈ టీజర్ రావడం ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read Also: EV Buses Electreon Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ రోడ్లు: కేబుల్స్ లేకుండానే ఆటోమొబైల్‌గా ఛార్జ్ అయ్యే ఈవీ బస్సులు.. త్వరలోనే ఇండియాలోకి సరికొత్త టెక్నాలజీ

ఏమిటీ బీవైడీ డీఎమ్-ఐ టెక్నాలజీ? 

బీవైడీ డెవలప్ చేసిన డీఎమ్-ఐ (DM-i) అనేది ఒక ఇంటెలిజెంట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్. సాధారణ హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజన్ మెయిన్ రోల్ ప్లే చేస్తే, ఈ టెక్నాలజీలో ఎలెక్ట్రిక్ డ్రైవింగ్‌కు మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కేవలం బ్యాటరీ రేంజ్ పెంచడానికి, ఎఫిషియన్సీని సపోర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్యూర్ ఎలెక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కార్లు ఎక్కువ దూరం ప్రయాణించగలవు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయాక పెట్రోల్ ఇంజన్ సాయంతో కంబైన్డ్‌గా ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఆఫర్ చేయడం ఈ టెక్నాలజీ స్పెషాలిటీ.

Read Also: MG Majestor SUV Launched: ఎమ్జీ మెజస్టర్ ఎస్‌యూవీ లాంచ్: టయోటా ఫార్చూనర్‌కు గట్టి పోటీగా వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్..

ఇండియాలో సీలియన్ 6 పీహెచ్ఈవీ టెస్టింగ్.. 

కొద్దిరోజుల క్రితం బీవైడీ సీలియన్ 6 (BYD Sealion 6) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇండియాలో ఎలాంటి ముసుగు లేకుండా టెస్టింగ్ చేస్తూ దొరికిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో సాంగ్ ప్లస్, సీల్ యూ అని పిలిచే ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ లేటెస్ట్ ఓషన్ సిరీస్ డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తోంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు బీవైడీ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ, ఎలెక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. రొటేటింగ్ 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్, అడాస్ సేఫ్టీ సూట్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్న ఈ ప్రీమియం కారు ధర రూ. 45 లక్షల నుండి రూ. 50 లక్షల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది.

బడ్జెట్ ధరలో అట్టో 2 హైబ్రిడ్.. 

ఈ టీజర్ కేవలం సీలియన్ 6 కోసమే కాకుండా కాంపాక్ట్ ఎస్‌యూవీ అట్టో 2 (BYD Atto 2) కోసం కూడా అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్లో ఉన్న అట్టో 2 డీఎమ్-ఐ మోడల్ సుమారు 90 కిలోమీటర్ల వరకు ప్యూర్ ఈవీ రేంజ్ ఇస్తూ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. సిటీ రైడర్లకు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ కారు రొటేటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్, కనెక్టెడ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో రూ. 25 లక్షల బడ్జెట్ రేంజ్ లో వచ్చే అవకాశం ఉంది. లాంగ్ డ్రైవ్స్ వెళ్లేటప్పుడు ఛార్జింగ్ స్టేషన్ల ఇబ్బంది లేకుండా ఎలెక్ట్రిక్ కార్ల బెనిఫిట్స్ పొందాలనుకునే భారతీయ కస్టమర్లను ఆకర్షించడానికి బీవైడీ ఈ హైబ్రిడ్ కార్లను రంగంలోకి దించుతోంది.