సిట్రియోన్ సీ3 (Citreon C3) కారును ఎస్‌యూవీ (SUV) అనడం కంటే ఎస్‌యూవీలా కనిపించే హ్యాచ్‌బ్యాక్ (Hatchback) అనడం కరెక్ట్. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ స్పెసిఫిక్ కార్లు ఇప్పటికే రోడ్ల మీద కనిపించాయి. ఈ కారును బాగా లోకలైజ్ చేయనున్నారని తెలుస్తోంది. అంటే దీని ధర కూడా తక్కువగా ఉండనుంది. టాటా పంచ్‌తో (Tata Punch) సిట్రియోన్ సీ3 పోటీ పడనుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్‌గా ఉండనుందో ఇప్పుడు చూద్దాం...


ఏ కారు పెద్దగా ఉండనుంది?
ఈ రెండిట్లో సిట్రియోన్ సీ3 పొడవు 3980 మిల్లీమీటర్లు కాగా... టాటా పంచ్ పొడవు 3827 మిల్లీమీటర్లుగా ఉంది. సిట్రియోన్ సీ3 కారు కొలతలు ఇంకా తెలియాల్సి ఉంది. టాటా పంచ్, సిట్రియోన్ చూడటానికి దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే పంచ్ లుక్ కొంచెం ఎస్‌యూవీ తరహాలో ఉండనుంది.


ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి?
వీటిలో పంచ్ ఫుల్లీ లోడెడ్ కారు. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్స్, పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనకవైపు కెమెరా ఉన్నాయి. సిట్రియోన్ సీ3లో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. కానీ ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్‌ను ఇందులో అందించడం లేదు. సిట్రియోన్ సీ3లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. పంచ్ వీల్ బేస్ 2,445 మిల్లీమీటర్లు కాగా... సిట్రియోన్ సీ3 వీల్ బేస్ 2,540 మిల్లీమీటర్లుగా ఉంది.


ఇంజిన్లు ఎలా ఉన్నాయి?
సిట్రియోన్ సీ3లో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ లేదా టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ యూనిట్ ఉండనుంది. ఇక పంచ్‌లో కేవలం 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఏఎంటీ, మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్లను ఇందులో అందించారు.


మరి ధర?
టాటా పంచ్ ధర రూ.5.6 లక్షల నుంచి రూ.8.9 లక్షలుగా ఉండనుంది. ఇక సిట్రియోన్ సీ3 ధర కూడా పంచ్ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. పంచ్‌కు గట్టిపోటీ ఇవ్వాలంటే మాత్రం సిట్రియోన్ దాని కంటే తక్కువ రేటుకు దించాల్సిందే. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం సిట్రియోన్ సీ3 ధర రూ.5.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?