సిట్రోయెన్ ఇండియా మనదేశంలో కొత్త బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారును లాంచ్ చేసింది. అదే సిట్రోయెన్ సీ3. దీని ధర మనదేశంలో రూ.5,70,500 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది లైవ్ ట్రిమ్ లెవల్ ధర. ఇక హైఎండ్ అయిన ఫీల్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.8,05,000గా ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా సిట్రోయెన్ సీ3లో ఉండనుంది.
ఈ కారులో ఏకంగా 56 కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 70కి పైగా యాక్సెసరీలు కూడా తీసుకోవచ్చు. వైబ్, ఎలిగెన్స్, ఎనర్జీ, కన్వీనియన్స్ అనే అదనపు ప్యాకేజీ ఆప్షన్లు కూడా ఈ కారుతో అందించారు. సిట్రోయెన్ సీ3... మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్, నిస్సాన్ మ్యాగ్నైట్, రెనో కిగర్‌లతో పోటీ పడనుంది.
సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి 1.2 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ ఆప్షన్. ఇది 81 హెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఇక టర్బో చార్జర్ ఇంజిన్ ఆప్షన్ 109 హెచ్‌పీ, 190 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో 5-స్పీడ్ మాన్యువల్, టర్బోచార్జ్‌డ్ ఇంజిన్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌లు ఉండనున్నాయి.
త్వరలో ఈ కారుకు సంబంధించి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా లాంచ్ కానున్నాయి. ఈ కారులో 10 అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉండనుంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను ఇది సపోర్ట్ చేయనుంది. 4-స్పీకర్ సౌండ్ సిస్టం, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, కాల్ బటన్లు, పవర్డ్ విండోస్, మాన్యువల్‌గా అడ్జస్ట్ చేసుకోదగిన డ్రైవర్ సీట్ ఈ కారులో ఉన్నాయి.
ఇక సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ సెన్సిటివ్ ఆటో-డోర్ లాక్, హై స్పీడ్ అలెర్ట్ సిస్టంలు సిట్రోయెన్ సీ3లో అందించారు. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?