Citroen C3 Aircross Automatic Launched: ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్ ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌ను రూ. 12.85 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్ షోరూమ్) విడుదల చేసింది. సీ3 ఎయిర్‌క్రాస్ ఏటీ అనేది కంపెనీ లాంచ్ చేసిన సీ క్యూబ్డ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన మొదటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మోడల్. కంపెనీ ఈ ఎస్‌యూవీని ప్లస్, మాక్స్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇది 5, 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లతో అందుబాటులో ఉంటుంది.


మీరు కూడా సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇక ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇందులో 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్ 110 హెచ్‌పీ పవర్, 190 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.


సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ మైలేజ్
ఈ ఎస్‌యూవీ ఇప్పుడు దాని ఐసీఈ మోడల్ కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పుడు 110 హెచ్‌పీ పవర్, 215 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ గురించి చెప్పాలంటే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఉంది. దీనిలో మాన్యువల్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ ప్యాడిల్ షిఫ్టర్లు అందుబాటులో లేవు. మైలేజీ గురించి చెప్పాలంటే ఇది ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 17.6 కిలోమీటర్ల వరకు ఉంది.


సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ ఫీచర్లు
డిజైన్, ఫీచర్ల గురించి చెప్పాలంటే ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే పెద్దగా ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో ఫంక్షనాలిటీత ఉన్న10.2 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, అలాగే 7.0 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది.


ధర ఎంత?
సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ బేస్ స్పెక్ ప్లస్ వేరియంట్ 5 సీటర్ ప్రారంభ ధర రూ. 12.85 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. మాక్స్ ఏటీ వేరియంట్ 5 సీటర్ ధర రూ.13.5 లక్షలుగానూ, మాక్స్ ఏటీ 5+2 వేరియంట్ ధర రూ. 13.85 లక్షలుగానూ ఉంది.


మరోవైపు హ్యుందాయ్ కొత్త క్రెటా తదుపరి వెర్షన్‌ని సిద్ధం చేస్తుంది. వీటిలో క్రెటా ఎన్ లైన్ కూడా ఉంది. క్రెటాలో కూడా ఎన్ సిరీస్ కారు త్వరలో లాంచ్ కానుంది. క్రెటా కారు ఎన్ లైన్... ఐ20 ఎన్ లైన్ కంటే కాస్త హయ్యర్ రేంజ్‌లో రానుందని తెలుస్తోంది. ఇటీవల లాంచ్ అయిన కొత్త క్రెటా ఎన్ లైన్ ఆధారంగా ఇందులో కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనున్నారని తెలుస్తోంది. క్రెటా ఎన్ లైన్ కొత్త బంపర్ ఎక్స్‌టెన్షన్‌లు, సైడ్ స్కర్ట్‌లు, పెద్ద రియర్ స్పాయిలర్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన 18 అంగుళాల వీల్స్‌తో స్టాండర్డ్ క్రెటా కంటే స్పోర్టివ్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఈ కారు వెనుక భాగంలో పెద్ద స్పాయిలర్, ప్రొట్రూడింగ్ ఎగ్జాస్ట్ సహా ఇంకెన్నో చూడవచ్చు. క్యాబిన్ గురించి చెప్పాలంటే స్టీరింగ్ వీల్ డిజైన్ స్టాండర్డ్ క్రెటాలోని డీ-కట్ స్టీరింగ్ వీల్‌కు భిన్నంగా ఉండనుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!