Citroen Basalt Features: ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ బసాల్ట్‌ ఎస్‌యూవీ కూపే (Basalt SUV Coupe)ను ఆగస్టు 2న విడుదల చేయనుంది. మార్కెట్‌లో లాంచ్‌కి ముందే ఇందులో లభించే ఫీచర్లు అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ సరికొత్త కూపే కంపెనీ లైనప్‌లోని ఇతర కార్ మోడల్స్‌ సీ3, సీ 3 ఎయిర్‌క్రాస్, ఇ-సీ3లతో పోల్చితే స్వల్ప మార్పులతో అందుబాటులోకి రానుంది. అయితే దీని ఫ్రంట్ డిజైన్ దాదాపు మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉండనుంది. కానీ వెనుక భాగంలో షార్ప్ రూఫ్‌లైన్‌ని కలిగి ఎస్‌యూవీ-కూపే డిజైన్‌ని మాదిరిగా ఉంటుంది.




తాజాగా ఆ కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం దాని ఇంటీరియర్ డిజైన్‌ మరింత ప్రీమియంగా ఉండటంతో ఈ కారుపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి భారత మార్కెట్‌లో ఎస్‌యూవీ-కూపే మోడళ్లు లేవు. అయితే టాటా కూడా ఈ సెగ్మెంట్‌లో ఆగస్టు 7న కర్వ్‌ ఎస్‌యూవీని (Tata Curvv) విడుదల చేస్తుంది. ఈ రెండు ఎస్‌యూవీలు అందుబాటు ధరల్లో విడుదల చేస్తే మార్కెట్‌ని ఇతర కంపెనీల సేల్స్‌ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందువల్ల వీటి విడుదలపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది.

బసాల్ట్ డిజైన్:
సిట్రోయిన్ బసాల్ట్ ఫ్రంట్ సీ3 ఎయిర్‌క్రాస్‌ని పోలిన డిజైన్‌తో ఉన్నప్పటికీ.. కొన్ని స్వల్ప మార్పులు చేశారు. ఈ ప్రొడక్షన్-స్పెక్ బసాల్ట్‌లో చిన్న అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్‌తో కొత్త రూపాన్ని కలిగి ఉంటుంది. రియర్ బూట్‌స్పేస్ దాదాపు విండ్ షీల్డ్ కవర్‌తో ఉంటుంది. LED DRLs, హెడ్‌ల్యాంప్స్‌ కారు ముందు భాగంలో ప్రత్యేక డిజైన్‌తో ఆకట్టుకోనున్నాయి.


ఇంటీరియర్:
సిట్రోయన్ బసాల్ట్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్ప్లే ఉంటుంది. క్యాబిన్ సీట్లు, కొత్త డ్యాష్ బోర్డ్ డార్క్‌ బ్రౌన్‌ (Dark Brown) క్యాబిన్ థీమ్‌తో సుందరంగా కనిపిస్తుంది. ఇందులో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌ని కలిగి ఉన్నాయి. ముందు, వెనుక సీట్లకు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌లు అందించారు. ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్, వెనుక భాగంలో కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఆటోమేటిక్‌ క్రూయిజ్ కంట్రోల్, ఏసీ వెంట్స్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. 
ఇక సేఫ్టీ పరంగా చూస్తే ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), రియర్ పార్కింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)తో రానుంది. 




సిట్రోయిన్ సి-3 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే బసాల్ట్ లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ గరిష్టంగా 110bhp వద్ద 20nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త బసాల్ట్ ధర సిట్రోయెన్ సీ -3 ఎయిర్‌క్రాస్‌తో సమానంగా ఉండనుంది.  ప్రస్తుతం ఈ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంది. అతి త్వరలో విడుదల కాబోయే ఈ సిట్రోయిన్ బసాల్ట్ టాటా కర్వ్‌కి నేరుగా పోటీ ఇవ్వనుంది. దీనికి ప్రకటించే ధరను బట్టి రెస్పాన్స్‌ వచ్చే అవకాశం ఉంది. భారతీయ మార్కెట్లో తమదైన ముద్ర వేయాలని చూస్తున్న సిట్రోయిన్‌ టీం ఇండియా మాజీ కెప్టెన్‌ని మహీంద్రా సింగ్‌ ధోనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. 


 


Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్


Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి