భారతదేశంలో రోజురోజుకూ లగ్జరీ కార్ల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా తరువాత కార్ల కొనుగోలుపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. భారత్ మార్కెట్లో నేడు కాంపాక్ట్ SUV విభాగం వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంలో Citroen Basalt , Kia Sonet ఒకదానికొకటి పరస్పరం పోటీ పడుతున్నాయి. Citroen Basalt కారు కూపే-శైలి SUV. ఇది దాని ప్రత్యేకమైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ వల్ల ఫేమస్ అవుతోంది. అదే సమయంలో Kia Sonet ఇప్పటికే ఈ విభాగంలో బలమైన, నమ్మదగిన SUVగా భావిస్తారు. 2 కార్లు వేర్వేరు రకాల కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. కాబట్టి ఫీచర్ల పరంగా ఏ SUV మరింత శక్తివంతమైనదో చూద్దాం.

Continues below advertisement

ఫీచర్లలో ఎవరిది పైచేయి?

Citroen Basalt సౌకర్యం, అవసరమైన టెక్నాలజీ కాంబినేషన్ కలిగి ఉంది. ఇది పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Android Auto తో పాటు Apple CarPlay సపోర్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంది. దీని బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫ్యామిలీ జర్నీలను, లాంగ్ డ్రైవ్‌లను సులభతరం చేస్తుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్ వంటి సౌకర్యాలు దీనిని ఒక నమ్మదగిన SUVగా చేస్తాయి.

మరోవైపు, Kia Sonet ఫీచర్ల పరంగా మరింత ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇది వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, అనేక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. రోజువారీ ఉపయోగంలో ఈ ఫీచర్లు కియా Sonetను మరింత బెస్ట్ అనిపిస్తాయి.

Continues below advertisement

ఇంజిన్, డ్రైవింగ్ అనుభవం

Citroen Basalt స్మూత్ డ్రైవింగ్, మంచి మైలేజ్ కోసం తెలిసిన పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది. దీని సస్పెన్షన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇది గతుకుల రోడ్లపై కూడా ప్రయాణాన్ని ఇబ్బంది లేకుండా చేస్తుంది. అదే సమయంలో Kia Sonet ఇంజిన్ ఎంపికలలో ముందుంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంది. అలాగే మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఇచ్చారు. ఎక్కువ ఎనర్జీతో పాటు మంచి పనితీరు కోరుకునే వారికి కియా Sonet మంచిది.

భద్రత కోసం ఏమున్నాయి

Citroen Basalt 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అవసరమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. Kia Sonet భద్రతా పరంగా ఒక అడుగు ముందుంది. ఎందుకంటే ఇది ADAS, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి మోడ్రన్ ఫీచర్లను కలిగి ఉంది. రెండింటి ధర దాదాపు సమానంగా ఉంటుంది. కానీ ఫీచర్లు, భద్రత కారణంగా Kia Sonet ఎక్కువ విలువను కలిగి ఉంది. మీరు ప్రత్యేకమైన డిజైన్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ కోరుకుంటే, Citroen Basalt ఒక మంచి నిర్ణయం. కానీ ఎక్కువ ఫీచర్లు, ఇంజిన్ వేరియంట్లు, అధిక భద్రత కోసం Kia Sonet మరింత శక్తివంతమైన SUV అని భావిస్తారు. 

Also Read: ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే