ప్రముఖ టూవీలర్ కంపెనీ బజాజ్ చేతక్ నుంచి మరో అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే విడుదలైన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అతి త్వరలో అప్‍డేటెడ్ వెర్షన్ వినియోగదారుల ముందుకు రానుంది. లేటెస్ట్ వెర్షన్ 2023 ఎలక్ట్రిక్  స్కూటర్ మరింత రేంజ్ తో పాటు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్కూటర్ తో పోల్చితే 20 శాతం ఎక్కువ రేంజ్‍ను కలిగి ఉంటుంది. 2.88 kWh బ్యాటరీ ఉన్న ప్రస్తుత మోడల్ 90 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తున్నది.  చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‍ ఒక్క ఛార్జ్ తో 108 కిలో మీటర్ల రేంజ్ అందివ్వనుంది.






కొత్త స్కూటర్ లో మార్పులు ఇవే!


బజాజ్ చేతక్ అప్‍డేటెడ్ వెర్షన్‍ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.88 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. కొన్ని మార్పుల కారణంగా  ప్రస్తుత మోడల్ తో పోల్చితే మరింత ఎక్కువ రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ స్కూటర్ ఒక్క ఛార్జ్ తో 108కిలో మీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉంది. స్కూటర్ ఔట్‍పుట్ మాత్రం ప్రస్తుతం ఉన్న మోడ ల్‍లాగే ఉంటుంటుంది. ఇక ఈ లేటెస్ట్ స్కూటర్ కు సంబంధించిన  మోటర్ 4kW పవర్‌ను కలిగి ఉంటుంది. అప్ డేటెడ్ వెర్షన్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలో మీటర్లుగా ఉండనుంది.


ఎక్కువ రేంజ్ తో సరికొత్త స్కూటర్


ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ తో పోల్చితే మరింత ఎక్కువ దూరాన్ని అందివ్వనుంది. ప్రస్తుతం ఉన్న ఐక్యూబ్ ఎస్ మోడల్ ఒక్క ఛార్జ్ తో 100 కీలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అటు ఏథర్ 450 ఎక్స్ స్కూటర్ 146 కిలో మీటర్ల రేంజ్ ఇవ్వగా, ఓలా ఎస్1 ప్రో ఏకంగా 170 కిలో మీటర్ల రేంజ్ ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చేతక్ 108 రేంజిని అందుబాటులోకి తీసుకురాబోతోంది.  


మరింత ప్రీమియమ్ లుక్


ఇక ఈ స్కూటర్ లేస్ట్ డిజైన్ ను పరిశీలిస్తే, బిల్డ్ క్వాలిటీ, డిజైన్ చేతక్ స్కూటర్ ను మరింత ప్రీమియమ్ లుక్ లో కనిపించేలా చేస్తోంది. ఎల్‍సీడీ టచ్‍స్క్రీన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, సాఫ్ట్ టచ్ స్విఫ్ట్ గేర్, మెటల్ బాడీతో అద్భుతమైన రూపాన్ని కలిగి ఉంది. ప్రస్తుత అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. లక్షా 41 వేలుగా ఉంది. 2022లో సుమారు 30 వేల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యూనిట్లు దేశంలో అమ్ముడయ్యాయి. కొత్త వెర్షన్ ధర ను కంపెనీ రూ. 1.2 లక్షలుగా నిర్ణయించింది.  






Read Also: అదిరిపోయే ఫీచర్లతో హీరో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్, విడుదల ఎప్పుడంటే?