Ultraviolette f77 Bikes: ఒక్క ఛార్జింగ్ తో 300 కిలో మీటర్లు రయ్ రయ్- రెండు వేరియంట్లలో ఎలక్ట్రికల్ బైకు

అల్ట్రావయోలెట్ తాజాగా రెండు ఎలక్ట్రికల్ బైక్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లుతో పాటూ టెస్లా వంటి దిగ్గజ సంస్థ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తాయంటున్న ఈ బైకుల విశేషాలేంటో… మీరూ చూసేయండి. 

Continues below advertisement

Ultraviolette f77 bikes : పర్యావరణహిత ఎలక్ట్రికల్ వాహనాలకు భారత ప్రభుత్వం నుంచి గట్టి మద్ధతు లభిస్తున్న నేపథ్యంలో అనేక సంస్థలు… సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రికల్ వెహికిల్స్ ను తీసుకువస్తున్నారు. అలా… బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అల్ట్రావయోలెట్ అనే స్టార్టప్ సంస్థ… తాజాగా రెండు ఎలక్ట్రికల్ బైక్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, టెస్లా వంటి దిగ్గజ సంస్థ కంటే మెరుగైన మైలేజ్ ఇస్తాయంటున్న ఈ బైకుల విశేషాలేంటో… మీరూ తెలుసుకోండి. 

Continues below advertisement

అల్ట్రావయోలెట్... F- 77 పేరుతో రెండు వేరియంట్లతో ఎలక్ట్రికల్ బైకుల్ని లాంచ్ చేసింది. స్పోర్ట్స్ బైకు ప్రియులను ఆకట్టుకునేలా మంచి డిజైన్, రేసింగ్ మోడల్ సిట్టింగ్ పొజిషన్ తో రైడర్ కు సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఈ బైకులు రేసింగ్ ఇష్టపడే కుర్రకారును ఆకర్షించేలా రూపొందించారు. 7.1 kwh స్టాండర్డ్ కెపాసిటీ బ్యాటరీ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 211 km మైలేజ్ ఇవ్వనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టాప్ స్పీడ్ ఇక 10.3 kwh బ్యాటరీ బైక్ అయితే ఫుల్ ఛార్జింగ్ తో ఏకంగా… 323 km మైలేజ్ ఇస్తుందని… అల్ట్రా వయోలెట్ ప్రతినిధులు వెల్లడించారు. దీని టాప్ స్పీడ్ 150 km/Hr ఇక… మొదటి వేరియంట్ ధరను రూ. 2.99 లక్షలుగా ఫిక్స్ చేయగా…  రీకాన్ వేరియంట్ ధరను రూ. 3.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దీని టాప్ స్పీడ్ 150 km/Hr గా సంస్థ ప్రకటించింది. 

ఎలక్ట్రికల్ వెహికిల్స్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న అల్ట్రావయోలెట్ బైక్స్ కేవలం గంట పాటు ఛార్జింగ్ చేస్తే 35 కిలోమీటర్ల రేంజ్ ప్రయణించనుందని వెల్లడించింది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. స్టార్ట్ స్టాండర్డ్ వేరియంట్ బైకుకు 5 ఏళ్లు లేదా 1 లక్ష కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ కంపెనీ ఇస్తుండగా, రీకాన్ వేరియంట్ కు 8 ఏళ్లు లేదా 8 లక్షల కిలోమీటర్ల వరకు వారెంట్ అందిస్తోంది. 
             
దేశీయ ఎలక్ట్రికల్ వెహికిల్ తయారీదారుడిగా ఉన్న అల్ట్రావయోలెట్ సంస్థ ఇక్కడ వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే.. ఈ బైకుల్లో కాంబాట్, బాలిస్టిక్ ఫీచర్లతో పాటు డైనమిక్ స్టేబుల్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెంట్ వంటి సౌకర్యాలు అందిస్తోంది. వాటితో పాటు… బైక్ రక్షణ కోసం ఫైన్డ్ మై వెహికిల్, డీప్ స్పీప్, బైక్ స్పీడ్ ను కంట్రోల్ చేసే త్రోటెల్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందిస్తోంది.  
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

                      రైడర్ కు పెట్రోల్ బైక్ కు, ఎలక్ట్రికల్ బైకుకు టాప్ స్పీడ్ అందుకోవడంలోని వ్యత్యాసం తెలియకుండా… కేవలం 7.8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకునేలా డిజైన్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా  - మేక్ ఫర్ వరల్డ్ అంటూ ప్రధాని మోదీ పిలుపు మేరకు అల్ట్రావయోలెట్ ఆవిష్కరణలు దేశీయ అవసరాలు తీర్చుతూనే… అంతర్జాతీయ విపణీలోనూ సత్తా చాటేందుకు తగిన విధంగా రూపొందిస్తున్నామని ఈ సంస్థల వ్యవస్థాపకులు నారాయణ సుబ్రహ్మణ్యన్, నీరజ్ రాజ్ మోహన్ చెబుతున్నారు.

Continues below advertisement