Cars With Air Purifier: దేశంలోని ప్రముఖ నగరాల్లో గాలి నిరంతరం కాలుష్యపూరితం అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు రోడ్లపైకి రావడమే కష్టంగా మారింది. బైక్‌పై ప్రయాణించే వారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కార్లలో ప్రయాణించే వారు కూడా ఈ కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి కాలంలో మీరు కారును కొనుగోలు చేసేటప్పుడు, అందులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్ ఉందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేయండి. ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఇన్‌స్టాల్ చేసిన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొన్ని కార్లు తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.
హోండా అమేజ్ (Honda Amaze)
ఎయిర్ ప్యూరిఫైయర్‌తో వస్తున్న కార్ల జాబితాలో హోండా అమేజ్ కూడా ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7,62,800 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ఐదు కలర్ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ హోండా కారు 1199 సీసీ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్పీఎం వద్ద 90 పీఎస్ పవర్‌ని, 4,800 ఆర్పీఎం వద్ద 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 18.6 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 18.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
Also Read: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ కూడా మంచి కారు అని చెప్పవచ్చు. ఈ కారు మొత్తం 100 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో ఐదు కలర్ ఆప్షన్లు కూడా అందించారు. టాటా నెక్సాన్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా అందుబాటులో ఉంది. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ఈ కారులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్ కూడా ఉంది. భద్రత కోసం కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించారు. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)
మహీంద్రా ఎక్స్‌యూవీ700 అనేది 5 సీటర్ కారు. ఈ కారులో ఎంహాక్ సీఆర్డీఐ ఇంజన్ చూడవచ్చు. ఈ ఇంజన్ 3,750 ఆర్పీఎం వద్ద 152.87 కేడబ్ల్యూ పవర్‌ని, 1,500-2,000 ఆర్పీఎం వద్ద 360 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్ కూడా ఉంది. ఈ మహీంద్రా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
మనదేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడు కాలుష్యం గురించి టాపిక్ వచ్చినా ఢిల్లీ పేరు గుర్తుకు వస్తుంది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల్లో కూడా కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చాలా మంది సొంత వాహనాలు కొనుగోలు చేశారు. ఈ కాలుష్యానికి అది కూడా ఒక కారణమే. రోడ్లపై కారులో ప్రయాణించేటప్పుడు ఇటువంటి కార్లు కాలుష్యం బారిన పడకుండా కాపాడతాయి.
Also Read: మాకు సీఎన్‌జీ కార్లే కావాలంటున్న ప్రజలు - భారీగా పెరుగుతున్న డిమాండ్!