Government GST Reforms Relief On Automobiles: భారతదేశంలో కొత్తగా కారు లేదా బైక్‌/స్కూటర్‌ కొనబోయే వాళ్లకు శుభవార్త. ప్రధానమంత్రి మోదీ, స్వాతంత్ర్య దినోత్సవం నాడు కొత్త "GST సంస్కరణలు 2025" ‍‌(GST Reforms 2025) ను ప్రకటించారు. ఈ సంస్కరణలను దీపావళి నాటికి దానిని అమలు చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం & సాధారణ వినియోగదారులకు ఉపశమనం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. చిన్న కార్లు & ఎంట్రీ లెవల్ బైక్‌లను కొనుగోలు చేయాలనుకునే ఆటోమొబైల్‌ కంపెనీలకు అతి పెద్ద ప్రయోజనం ఉంటుంది. తద్వారా, కొత్త కస్టమర్లకు కూడా ఆ బెనిఫిట్‌ దక్కుతుంది.

చిన్న కార్లపై పన్ను తగ్గుతుందా?ఇప్పటివరకు చిన్న కార్లపై 28% GST & 1% నుంచి 3% సెస్సు విధిస్తున్నారు. ఈ పరిధిలో... 1.2 లీటర్ ఇంజిన్ వరకు & 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న కార్లు వస్తాయి. ఆల్టో K10, వ్యాగన్ R, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, టాటా టియాగో, టిగోర్, పంచ్, హ్యుందాయ్ i10, i20 & ఎక్స్‌టర్ వంటి కార్లు ఇప్పుడు ఖరీదైనవి కావడానికి ఇదే కారణం. కొత్త సంస్కరణ తర్వాత, వాటిని 28% GST శ్లాబ్‌ నుంచి 18% టాక్స్‌ శ్లాబ్‌లోకి తీసుకురావచ్చు. అంటే రాబోయే కాలంలో ఈ కార్లన్నీ చాలా చౌకగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మిడ్‌ రేంజ్‌ & పెద్ద కార్లపైనా ప్రభావం1.5 లీటర్ల వరకు ఇంజిన్లు కలిగిన మిడ్-సైజ్ కార్లు & SUVలు ప్రస్తుతం 28% GST శ్లాబ్‌ & 15% సెస్సు పరిధిలో ఉన్నాయి. ఈ కారణంగా అవి దాదాపు 43% పన్ను పరిధిలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, వీటిని కూడా కొత్త 40% స్లాబ్ కిందకు తీసుకురావచ్చు. ఇది జరిగితే, మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, కియా సెల్టోస్, సోనెట్ & హ్యుందాయ్ క్రెటా వంటి ప్రముఖ SUVల ధరలు కూడా 3% వరకు తగ్గుతాయి.

మోటార్ సైకిల్ లేదా స్కూటర్‌ కొనేవాళ్ల మాటేమిటి?భారత ప్రభుత్వం తీసుకు వస్తున్న GST సంస్కరణలు కారు కొనుగోలుదారులకు మాత్రమే కాకుండా బైక్ కొనుగోలుదారులకు కూడా ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం, 350cc వరకు ఉన్న బైక్‌లపై 28% GST విధిస్తున్నారు, దీనిని 18% శ్లాబ్‌లోకి తగ్గించాలని సర్కారు యోచిస్ోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే... హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ & TVS రైడర్ వంటి ఎంట్రీ-లెవల్ & కమ్యూటర్ బైక్‌ల రేట్లు భారీగా తగ్గి, చౌకగా మారతాయి. అదే సమయంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ 650cc, KTM & హార్లే డేవిడ్‌సన్ వంటి 350cc కంటే ఎక్కువ ఇంజిన్‌ కెపాసిటీ కలిగిన ప్రీమియం బైక్‌లపై అధిక పన్నులు ఉంటాయి. నూతన పన్ను మార్పులు స్కూటర్లకు వర్తించే అవకాశం కూడా ఉంది.

ఈ మార్పు ఎందుకు అవసరం?భారతదేశంలో, కార్ల కంటే ద్విచక్ర వాహనాల కొనుగోలుదారుల సంఖ్య చాలా ఎక్కువ. కార్లు కొనేవాళ్లలోనూ మెజారిటీ వర్గం చిన్న కార్ల వైపే మొగ్గు చూపుతోంది. టూవీలర్లు కొనేవాళ్లలో ఎక్కువ మంది ఎంట్రీ లెవల్ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు, ప్రభుత్వం 350cc వరకు బైక్‌లు & చిన్న కార్లపై పన్నును తగ్గిస్తే, అది వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అదే సమయంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో హుషారు, సేల్స్‌ పెరుగుతాయి. అమ్మకాలు పెరగడం వల్ల పన్నుల రూపంలో ప్రభుత్వం పెరుగుతుంది, పన్నులు తగ్గించిన గ్యాప్‌ పూడిపోతుంది. ఫైనల్‌గా, ప్రభుత్వంపై పెద్దగా భారం ఉండదు & అదే సమయంలో ప్రజలకు తక్కువ ధరలకు వాహనాలు అందుబాటులోకి వస్తాయి.