Mobile services stopped in many states:  ఫోన్ సిగ్నల్స్ తేడా వస్తే గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి   ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు జైపూర్, కాన్పూర్, అహ్మదాబాద్, సూరత్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, నాగ్‌పూర్, లక్నో, చండీగఢ్, గువాహటి వంటి ప్రధాన నగరాల్లో ఫోన్ వినియోగదారులు ఎదుర్కొన్నారు. ఎక్కువగా ఎయిర్‌టెల్ వినియోగదారులు నెట్‌వర్క్ అంతరాయాలను ఎదుర్కొన్నారు. సమస్యలు సాయంత్రం 3:30 గంటల నుంచి (IST) ప్రారంభమై, సాయంత్రం 4:30 గంటల వరకు ఈ సమస్య తీవ్రంగా ఏర్పడింది. 

Continues below advertisement


68 శాతం వినియోగదారులు  ఫోన్ కాల్స్ కాల్ డ్రాప్‌లు, కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నట్లుగా రిపోర్టు చేశారు.  16 శాతం మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ అంతరాయాలను ఎదుర్కొన్నారు. 15 శాతం వినియోగదారులు సిగ్నల్ లేకపోవడం లేదా బలహీన సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంతారు.  కొంతమంది వినియోగదారులు 5G ప్లాన్‌లు ఉన్నప్పటికీ 4G నెట్‌వర్క్‌లో డేటా వినియోగం తగ్గడం గురించి ఫిర్యాదు చేశారు. జియో , వోడాఫోన్ ఐడియా (Vi)  ఎయిర్‌టెల్‌  వినియోగదారులు ఇవే  సమస్యలను రిపోర్టు చేశారు.  అయితే ఈ నెట్ వర్క్  సమస్యలు ఎయిర్‌టెల్‌తో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఉన్నాయి. 



అవుటేజ్ ట్రాకింగ్ పోర్టల్  డౌన్‌డిటెక్టర్  ప్రకారం, ఆగస్టు 18, 2025 సాయంత్రం 4:32 గంటల వరకు ఎయిర్‌టెల్ సేవలకు సంబంధించి 3,600 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి, ఇవి 3:30 PM నుంచి పెరగడం ప్రారంభమైంది. ఈ సమస్యలు మొబైల్ నెట్‌వర్క్‌కు మాత్రమే పరిమితం కాగా, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ , వై-ఫై సేవలు సాధారణంగా పనిచేశాయి, ఇది వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో #AirtelDown హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది, వినియోగదారులు తమ ఫిర్యాదులను మీమ్స్, వ్యంగ్య పోస్టుల రూపంలో వ్యక్తం చేశారు.  



ఎయిర్‌టెల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా సమస్యను అధికారికంగా ధృవీకరించింది.  మేము ప్రస్తుతం నెట్‌వర్క్ అవుటేజ్‌ను ఎదుర్కొంటున్నాము, మా బృందం ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తోంది. అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలని ఎయిర్ టెల్ ప్రకటించింది.   ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గత ఒక గంటగా వాయిస్ కాలింగ్ సమస్యలు ఉన్నాయి. సమస్యలో గణనీయమైన భాగం ఇప్పటికే పరిష్కరించామని  ఇంజనీర్లు పూర్తి పునరుద్ధరణ కోసం పనిచేస్తున్నారని  తెలిపారు.  సాధారణంగా ఇటువంటి నెట్‌వర్క్ అవుటేజ్‌లకు   సాంకేతిక లోపాలు , ఫైబర్ కట్,  నెట్‌వర్క్ అప్‌గ్రేడ్**,  అధిక నెట్‌వర్క్ లోడ్ కారణాలుగా ఉంటాయి. అయితే, ఎయిర్‌టెల్ ఈ సమస్యకు నిర్దిష్ట కారణాన్ని బహిర్గతం చేయలేదు.