ఈ రోజుల్లో కొత్త కారు కొనడం అందరికీ వీలుకాదు. ఖర్చుల భారంతో ఇబ్బందిపడుతున్న వారికి కొత్త కారు డ్రీమ్ సులభం కాదు. ముఖ్యంగా కార్ల ధరలు పెరుగుతున్నప్పుడు, బడ్జెట్ ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవడం మంచిది. ఎక్కువ ఖర్చులు చేసి ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడకుండా ఒక మంచి ప్రత్యామ్నాయం ఇది. 2025లో GST 2.0 తర్వాత కొత్త కార్ల ధరలలో కొంత ఉపశమనం లభించింది. కానీ చాలా మంది తక్కువ ఖర్చుతో మంచి పాత కారును కొనుగోలు చేయాలని చూస్తున్నారు. సరైన సమాచారం, కొంచెం అవగాహనతో సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం ద్వారా మీరు చాలా నగదు ఆదా చేయవచ్చు.
సెకండ్ హ్యాండ్ కారు ఎక్కడ కొనాలి?
ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు అనేక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మంచి కండిషన్‌లో ఉన్న పాత కార్లు లభిస్తాయి. Cars24 వంటి వెబ్‌సైట్‌లో అనేక కార్లపై రూ. 1.8 లక్షల వరకు డిస్కౌంట్ ఉంది. ఇక్కడ ఫైనాన్స్, వారంటీ వంటి ప్రయోజనాలు కస్టమర్లకు లభిస్తాయి. మరోవైపు Spinny తక్కువ వడ్డీ రేటు, తక్కువ EMI లతో సెకండ్ హ్యాండ్ కారు లోన్ సౌకర్యాన్ని అందిస్తుంది. వీటితో పాటు మారుతి సుజుకీ ట్రూ వాల్యూ (Maruti Suzuki True Value), మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ (Mahindra First Choice) వంటి ప్లాట్‌ఫారమ్‌లు కూడా నమ్మకమైనవిగా భావిస్తారు. అయితే ఇక్కడ తనిఖీ చేసిన కార్లు లభిస్తాయి.
కారు కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడానికి ముందు మీ బడ్జెట్ ఎంత అని ప్లాన్ చేసుకోవాలి. ఆ తర్వాత కారు రిలీజ్ ఏడాది, సర్వీస్ హిస్టరీని తప్పకుండా తెలుసుకోవాలి. తరా వాహనం సరిగ్గా మెయింటైన్ చేశారా లేదా అని తెలుసుకోవచ్చు. ఓడోమీటర్ రీడింగ్, ఓనర్‌షిప్ వివరాలను కూడా చెక్ చేయడం మంచిది. కారు ఎక్కువ పాతది కాకుండా, ఎక్కువగా నడిపిన కారు అవకుండా చూసుకోండి. టెస్ట్ డ్రైవ్ తప్పకుండా చేయాలి. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజిన్ శబ్దం, బ్రేకులు, క్లచ్ తీరు, సస్పెన్షన్‌పై ఫోకస్ చేయాలి.
పేపర్ వర్క్‌లో నిర్లక్ష్యం చేయవద్దు
పాత కారు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. RC ట్రాన్స్‌ఫర్, ఇన్సూరెన్స్ ట్రాన్స్‌ఫర్, నో డ్యూస్ సర్టిఫికేట్‌ను సరిగ్గా చూసుకుని పూర్తి చేయాలి. కారు గతంలో ఫైనాన్స్‌పై ఉంటే, బ్యాంక్ నుండి NOC తీసుకోవడం మర్చిపోకూడదు. సరైన పేపర్‌వర్క్ చేసుకుంటే భవిష్యత్తులో ఏదైనా చట్టపరమైన సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకుంటే, పూర్తి తనిఖీ చేస్తే, పేపర్‌వర్క్‌లో జాగ్రత్త వహిస్తే, సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. దీని ద్వారా మీరు కొత్త కారుతో పోలిస్తే చాలా డబ్బు ఆదా చేయడంతో పాటు అధిక ఈఎంఐ టెన్షన్లు ఉండవు.
Also Read: Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో