Continues below advertisement

భారత ఆటోమొబైల్ మార్కెట్లో జీఎస్టీ తగ్గింపు తర్వాత కార్లు, బైకుల ధరలు తగ్గాయి. బైకులతో పాటు కార్లలో ప్రీమియం ఉండే వాటి ధరలలో ఎలాంటి మార్పు లేదు. కానీ తక్కువ సీసీ, కొన్ని నిబంధనల ప్రకారం కొన్ని కంపెనీల కార్ల వేరియంట్లపై ధరలు తగ్గడంతో గత ఏడాది చివరి త్రైమాసికంలో బైకులు, కార్ల విక్రయాలు పెరిగాయి. దేశంలోనే అత్యంత చౌకైన కార్ల జాబితాలో కూడా భార్పులు జరిగాయి. గతంలో మారుతి ఆల్టో K10 భారతదేశంలోనే అత్యంత చౌకైన కారు కాగా, జీఎస్టీ సంస్కరలతో ఇప్పుడు మారుతి ఎస్-ప్రెస్సో ఈ స్థానాన్ని తీసుకుంది. దీని ధర కేవలం 3.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దేశంలోనే 5 అత్యంత చౌకైన కార్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Maruti S-Presso

మారుతి ఎస్-ప్రెస్సోలో STD (O) వేరియంట్ ధర 4.26 లక్షల రూపాయలు ఉండేది. జీఎస్టీ తగ్గింపు తరువాత ఈ కారు ఇప్పుడు 3.49 లక్షల రూపాయలకు తగ్గింది. అంటే వినియోగదారులకు దాదాపు 76,600 రూపాయలు ప్రయోజనం చేకూరింది. ధరలో దాదాపు 18 శాతం తగ్గింపు తర్వాత ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కారుగా మారుతి ఎస్ ప్రెస్సో నిలిచింది. 

Continues below advertisement

మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10) 

గతంలో భారతదేశంలోనే అత్యంత చౌకైన కారుగా మారుతి ఆల్టో K10 ఉండేది. కానీ గత సెప్టెంబర్ లో జీఎస్టీ తగ్గింపు తరువాత ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది. దీని STD (O) వేరియంట్ ధర 4.23 లక్షల నుండి 3.69 లక్షల రూపాయలకు దిగొచ్చింది. అంటే వినియోగదారులకు ఈ కారుపై దాదాపు 53,100 రూపాయల ఆదా అవుతోంది. ఆల్టో K10 ఇప్పటికీ దాని తక్కువ ధర, నమ్మకమైన పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid)

ఇప్పుడు దేశంలో మూడవ అత్యంత చౌకైన కారు Renault Kwid. దీని 1.0 RXE వేరియంట్ ధర గతంలో రూ. 4.69 లక్షలు ఉండేది. ఇది ఇప్పుడు 4.29 లక్షల రూపాయలకు ధర దిగొచ్చింది. ఇందులో దాదాపు 40,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. SUV లాంటి స్టైలింగ్, బడ్జెట్-ఫ్రెండ్లీ ధర దీనిని ఎంట్రీ-లెవల్ వినియోగదారులకు మంచి ఎంపికగా మారుతోంది.

టాటా టియాగో (Tata Tiago) 

Tata Tiago దేశంలో నాల్గవ అత్యంత చౌకైన కారు టాటా టియాగో. గతంలో దీని XE వేరియంట్ ధర 4.99 లక్షలు ఉండేది. కానీ ఇటీవల GST తగ్గింపు తర్వాత ఇప్పుడు టాటా టియాగో 4.57 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అంటే వినియోగదారులకు దాదాపు 42,500  లాభం చేకూరింది. బలమైన బిల్డ్ క్వాలిటీ, స్టైలిష్ లుక్స్ కారణంగా ఈ ధర వద్ద Tiago విలువైన కారుగా నిలిచింది.

Maruti Celerio 

భారతదేశంలో చౌకైన కార్ల జాబితాలో Maruti Celerio ఉంది. దీని LXI వేరియంట్ ధర గత సెప్టెంబర్ నెలకు ముందు 5.64 లక్షల రూపాయలు ఉండేది. ఇప్పుడు మారుతి సెలెరియో రూ. 4.69 లక్షలకు తగ్గింది. ఇందులో కొనుగోలుదారులకు దాదాపు 94,100 రూపాయలు ఆదా అవుతోంది. ఇది దాదాపు 17% తగ్గింపు అన్నమాట. ఎక్కువ ధర తగ్గిన కారణంగా మారుతి Celerio కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.