Mahindra SUV XUV700 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా తమ మిడ్-సైజ్ SUV XUV700 కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ Mahindra XUV7XO ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ SUV న్యూ లుక్, మరిన్ని ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో రిలీజ్ చేశారు. మహీంద్రా కంపెనీ పాత ఇంజిన్‌నే కొనసాగించింది. కానీ డ్రైవింగ్‌ను గతంలో కంటే మరింత స్మూత్‌గా మార్చేలా డిజైన్ చేసింది. దీని బుకింగ్ కూడా ప్రస్తుతం ప్రారంభమైంది. ఈ SUV ఫ్యామిలీ జర్నీ చేసే వారు, యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ కొత్త మోడల్ ధర, ఫీచర్లు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Mahindra XUV7XO ధర, వేరియంట్లు
మహీంద్రా కంపెనీ Mahindra XUV7XO ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 13.66 లక్షల రూపాయలుగా ఉంది. ఇది దాని బేస్ వేరియంట్ AX కోసం ఫిక్స్ చేసిన ధర. ఈ SUV AX నుండి AX7L వరకు అనేక వేరియంట్లలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఎంట్రీ ధర మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని, ఆ తర్వాత ధర మారుతుందని తెలుస్తోంది.
కొత్త డిజైన్, ఆకట్టుకునే లుక్
డిజైన్ విషయానికి వస్తే XUV7XO మునుపటి కంటే మరింత బోల్డ్, మోడ్రన్‌గా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, డే-టైమ్ రన్నింగ్ లైట్లు ఇచ్చారు. ఇవి రోడ్డుపై మీ వాహనాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి. సైడ్‌లో 19 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో స్టైలిష్ LED టెయిల్‌ల్యాంప్‌లు దీనికి ప్రీమియం SUV లాంటి లుక్‌ను తీసుకొస్తాయి. మొత్తంగా, దీని డిజైన్ ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్లేవారితో పాటు యంగ్ కస్టమర్లకు సైతం నచ్చుతుంది.
సేఫ్టీ ఫీచర్లు
ఈ Mahindra XUV7XO SUV క్యాబిన్ పూర్తిగా టెక్నాలజీతో వచ్చింది. ఇందులో మూడు 12.3 అంగుళాల పెద్ద స్క్రీన్‌లు ఇచ్చారు. వీటిలో టచ్‌స్క్రీన్, డిజిటల్ మీటర్, ప్యాసింజర్ డిస్‌ప్లే ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, అద్భుతమైన మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ప్రయాణికుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఇచ్చారు.
ఎస్‌యూవీ ఇంజిన్, పనితీరు
Mahindra XUV7XO లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. రెండు ఇంజిన్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. 15 నుండి 20 లక్షల బడ్జెట్‌లో సురక్షితమైన, ఫీచర్లతో కూడిన కారు కావాలనుకునే వారికి ఈ SUV మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. మీరు కూడా ఫీచర్లతో పాటు ధర, లుక్ గమనించిన తరువాతే కొనుగోలు చేయడం మంచిది.