Brahmamudi Serial Today Episode: కావ్యను సీమంతానికి రెడీ చేస్తూ.. పాత విషయాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది కనకం. కావ్య కూడా దేనికైనా ఒపిక ఉండాలమ్మా అదే ఇప్పుడు నాకు సంతోషాన్ని ఇస్తుందని చెప్తుంది. అక్కడే కిటికీలోంచి రుద్రాణి, రేఖ చూస్తుంటారు. అప్పుడే అక్కడకు ఇందిరాదేవి వస్తుంది.
ఇందిరాదేవి: ఏం కనకం అయిపోయిందా.. మీ తల్లీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామా
కావ్య: ఏంటి అమ్మమ్మ మా అమ్మ రాక రాక వచ్చింది. ఆ మాత్రం మంచి చెడ్డా ఉండదా ఏంటి..?
ఇందిరాదేవి: నువ్వు ఉన్న చోట చెడుకు తావు ఎక్కడుంటుందే మనవరాలా..? అంతా మంచే కదా..? అది తెలిసి కూడా కొంచెం గ్యాప్ దొరికితే చాలు కుళాయిలు తిప్పేస్తారు తల్లీకూతుళ్లు..
కనకం: మీకు తెలియంది ఏముందమ్మా.. నా బిడ్డ ఇన్నాళ్లు ఎన్ని ఆటంకాలను దాటిందో.. ఎన్ని ఒడిదుడుకులను చూసిందో మీకు తెలుసు కదా..? ఇప్పుడిప్పుడే కదా దాని మనసు కుదటపడింది. మీ అందరి కళ్లల్లో వెలుగు నిండింది..
ఇందిరాదేవి: ఇక అంతా వెలుగే కనకం.. నా మనవరాలే ఈ ఇంటికి దీపం అయితే ఇక వెలుగుకు లోటు ఎక్కడ ఉంది
రేఖ: మమ్మీ వీళ్ల సెంటిమెంట్ అయ్యేట్టు లేదు.. ఇప్పుడెలా..?
రుద్రాణి: అదేనే సమస్యా సరే ఇప్పుడు కాదులే ఎవ్వరికీ డౌటు రాకుండా టైం చూసుకుని కలపాలి ఇప్పుడు వద్దు పద
అనుకుని ఇద్దరూ వెళ్లిపోతారు.
కనకం: అమ్మా మీరెన్ని చెప్పినా.. నా బిడ్డ గొప్పదనాన్ని ఎంత పొగిడినా..? ఇదంతా మీ చలవే..మీ అందరి మంచి మనసు వల్లే నా కూతురు ఇవాళ ఇలా ఉంది. దీనంతటికి కారణం మీరే
ఇందిరాదేవి: కనకం ఇప్పుడు ఇలాంటి దండాలు పెట్టకు ఈ వయసులో నాకు అహంకారం వస్తే బాగోదు.. పదండి టైం అవుతుంది.
అనుకుంటూ ముగ్గురు కిందకు వెళ్లిపోతారు. కింద సీమంతం మొదలవుతుంది. పంతులు మంత్రాలు చదువుతూ అంతా జరిపిస్తుంటాడు. ఎవ్వరూ గమనించకుండా రుద్రాణి కావ్య రూంలోకి వెళ్తుంది. అక్కడ కషాయంలో పసరు మందు కలపబోతుంటే.. వెనక నుంచి కనకం వచ్చి రుద్రాణి భుజం మీద చేయి వేస్తుంది. కనకనాన్ని చూసి రుద్రాణి భయపడుతుంది.
కనకం: ఏం చేస్తున్నావు..
రుద్రాణి: నేనేం చేస్తున్నాను. కావ్య కషాయం తాగాలి కదా..?
కనకం: కావ్య కషాయం తాగడం కాదు.. నువ్వెందుకు నా కూతురు గదికి వచ్చావు.. నా కూతురు తాగే కషాయం పట్టుకున్నావు
రుద్రాణి: చెప్తున్నాను కదా కనకం.. సీమంతం హడావిడిలో పడి కావ్య కషాయం తాగడం మర్చిపోయింది. అందుకే కావ్యకు కషాయం ఇద్దామని వచ్చాను అంతే
కనకం: కావ్యకు కషాయం ఇచ్చేదానివే అయితే నీ దగ్గర ఉన్న దాన్ని నా కూతురు కషాయంలో ఎందుకు కలుపుతున్నావు
రుద్రాణి: అది..
కనకం: చెప్పు ఏం చేయబోతున్నావు..
రుద్రాణి: ఏంటి కనకం ఏం మాట్లాడుతున్నావు నీకు ఎలా కనబడుతున్నాను
కనకం: అయిన వాళ్లకు కీడు చేయాలనుకున్న ఆడదానిలా కనిపిస్తున్నావు.. రాక్షసిలా కనిపిస్తున్నావు..
రుద్రాణి: మాటలు మర్యాదగా రాని..
కనకం: మర్యాదా..? అది నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు.. అందుకే అందరి కళ్లు కప్పి ఏదో కీడు తలపెట్టబోతున్నావు
రుద్రాణి: కనకం నీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు..
కనకం: నేనేం మర్చిపోలేదు.. నేను కావ్య తల్లిని ఆ స్థాయితోనే మాట్లాడుతున్నాను.. అసలు ఏంటిది
రుద్రాణి: కనబడటం లేదా..? కషాయం
కనకం: అది కషాయం కాదు.. పసరు మందు. ఆ పసరు మందు నా బిడ్డ తాగే కషాయంలో ఎందుకు కలుపుతున్నావు..
అంటూ కనకం నిలదీయగానే.. కావ్య మంచి కోసమే కలుపుతున్నాను.. పుట్టబోయే బిడ్డ బాగు కోసం కలుపుతున్నాను అంటూ.. కనకాన్ని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కింద సీమంతం జరుగుతుంటుంది. ఒక్కోక్కరుగా వెళ్లి బొట్టు పెట్టి గాజులు తొడిగి దీవిస్తుంటారు. ఇంతలో రుద్రాణి వెళ్లి బొట్టు పెట్టబోతుంటే.. కనకం బయటి నుంచి వచ్చి ఆగు రుద్రాని అంటూ గట్టిగా అరుస్తుంది. గడవ దగ్గర నిలబడిన కనకం పక్కన పసరు మందు వీరయ్య ఉంటాడు. వాళ్లను చూసిన రుద్రాణి షాక్ అవుతుంది. కనకం లోపలికి వచ్చి అందరికి నిజం చెప్తుంది. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!