BYD SEAL U: బీవైడీ తన సీల్ యూ ఎస్‌యూవీని జెనీవా మోటార్ షో 2024లో లాంచ్ చేసింది. ఇది సీల్ సెడాన్ తర్వాత లైనప్‌లో రెండో మోడల్‌గా నిలిచింది. బీవైడీ అనేది 2022లో 1.8 మిలియన్ వాహనాలు, 2023లో మూడు మిలియన్లకు పైగా అమ్మకాలతో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ (PHEV), ఈవీలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారు.
బీవైడీ సీల్ యూ ఎస్‌యూవీ ఎలా ఉంది?
సీల్డ్ యూ ఎస్‌యూవీ ఇప్పటికే చైనాలో బీవైడీ సాంగ్‌గా అమ్మకానికి అందుబాటులో ఉంది. దాని జెనీవా మోటార్ షో షోకేస్ బీవైడీ కంపెనీ. దీనిని యూరోపియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇది ఐరోపా కోసం బీవైడీ లాంచ్ చేసిన మొదటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వాహనం. సీల్ యూ ఎస్‌యూవీ 4,775 మిల్లీమీటర్లు పొడవు, 1,890 మిల్లీమీటర్లు వెడల్పు, 1,670 మిల్లీమీటర్లు ఎత్తుగా ఉంది. అంటే ఇది సీల్ సెడాన్ కంటే చాలా పెద్దదన్న మాట.
బీవైడీ సీల్డ్ యూ ఎస్‌యూవీ పవర్‌ట్రెయిన్
చైనాలో సీల్డ్ యూ ఎలక్ట్రిక్, పీహెచ్‌ఈవీ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంది. ఈ ఆప్షన్లు ఇతర ప్రపంచ మార్కెట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవీ 71 కేడబ్ల్యూహెచ్, 87 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇవి వరుసగా 520 కిలోమీటర్లు, 605 కిలోమీటర్లు (చైనీస్ సీఎల్టీసీ టెస్టింగ్ సైకిల్) రేంజ్‌ను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. సీల్ యూ ఈవీలో రెండు పవర్ అవుట్‌పుట్‌లతో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి 207 హెచ్‌పీ, 221 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తాయి. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 175 కిలోమీటర్లుగా ఉంది.
అయితే పీహెచ్‌ఈవీ వేరియంట్ 107 హెచ్‌పీ, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్‌తో 197 హెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో అమర్చారు. దీని 18.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కేవలం 110 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రేంజ్‌ను అందిస్తుంది. దాదాపు 35 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది స్టాండర్డ్‌గా వెహికల్ టు లోడ్ ఛార్జింగ్ కెపాసిటీతో వస్తుంది.
బీవైడీ సీల్ యూ ఎస్‌యూవీ ఫీచర్లు
బీవైడీ సీల్ యూ 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, వేగన్ లెదర్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ సిస్టమ్, బ్రాండ్ 15.6 అంగుళాల రొటేటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ప్రామాణికంగా వస్తుంది. బీవైడీ ప్రస్తుతం భారతదేశంలో అటో 3 ఎస్‌యూవీ, ఈ6 ఎంపీవీలతో సహా రెండు ఈవీలను విక్రయిస్తుంది. అయితే బీవైడీ సెయిల్ సెడాన్ మార్చి 5వ తేదీన విడుదల కానుంది.
మరోవైపు బజాజ్ ఇప్పుడు భారతదేశంలో అప్‌డేట్ చేసిన పల్సర్ ఎన్‌ఎస్125ని కూడా విడుదల చేసింది. ఈ కొత్త పల్సర్ ఎన్ఎస్125 బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,04,922గా నిర్ణయించారు. దీని పాత మోడల్‌తో పోలిస్తే, కొత్త పల్సర్ ఇప్పుడు రూ. 5,000 ధర ఎక్కువ అయింది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?