BYD Seal EV: చైనీస్ ఈవీ తయారీదారు బీవైడీ తన ఎలక్ట్రిక్ సెడాన్ కారు ‘సీల్’ను థాయ్‌లాండ్‌లో విడుదల చేసింది. దీని ధర భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 29.8 లక్షల వరకు ఉంది. అంటే భారతదేశంలో అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎంజీ జెడ్ఎస్ ప్రో డీటీ (ఆన్ రోడ్ దాదాపు రూ. 29.6 లక్షలు)కి దాదాపు సమానంగా ఉందన్న మాట.
బీవైడీ సీల్ ఈవీ పవర్ ప్యాక్, వేరియంట్‌లు
థాయ్ మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారు మూడు వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంది. బేస్ స్పెక్ డైనమిక్, మిడ్ స్పెక్ ప్రీమియం ఆఫ్ లైన్ AWD పనితీరును కలిగి ఉంటాయి. దీని డైనమిక్ వేరియంట్ 61.4 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్లడ్ బ్యాటరీల జతను కలిగి ఉంది. దీంతో 204 హెచ్‌పీ పవర్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ అందించనున్నారు. ఇది దాని వెనుక చక్రాలకు శక్తిని అందించడానికి పనిచేస్తుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 510 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. దీని మిడ్ స్పెక్ 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ పవర్ ప్యాక్‌తో రానుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 650 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది.
ఇండియా లాంచ్ త్వరలో
BYD సీల్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ కానుంది. కంపెనీ ఈ కారును 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీనిని కంపెనీ భారతీయ వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. ఇక దీని డిజైన్ గురించి చెప్పాలంటే చూడటానికి ఓషన్ బార్ తరహాలో ఉంటుంది. భారతదేశంలో బీవైడీ సీల్ సెడాన్ ఈవీ... ఎంజీ జెడ్ఎస్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్‌లతో పోటీ పడనున్నాయి.
మరోవైపు కంపెనీ మన దేశంలో కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి "బీవైడీ సీ లయన్" అనే పేరును కూడా ఇటీవలే ట్రేడ్ మార్క్ చేసింది. ప్రస్తుతానికి బీవైడీ సీ లయన్ అనేది పూర్తిగా కొత్త ఉత్పత్తి అవుతుందా లేదా భారతీయ మార్కెట్ కోసం కంపెనీ రీబ్రాండ్ చేసే ఏదైనా గ్లోబల్ మోడలా అనేది తెలియరాలేదు. దీని వివరాలు, స్పెసిఫికేషన్లు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే సీ లయన్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. 204 బీహెచ్‌పీ శక్తితో రేర్ వీల్ డ్రైవ్ (RWD) వెర్షన్, 530 బీహెచ్‌పీ శక్తితో డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది.
ఇందులో 82.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని అందిచనున్నారని సమాచారం. కొత్త బీవైడీ సీ లయన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందించగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ వైతో బీవైడీ సీ లయన్ పోటీ పడగలదని అంచనా.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial