BYD eMAX 7 Launched in India: చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ భారత మార్కెట్లో కొత్త కారును లాంచ్ చేసింది. అదే బీవైడీ ఈమ్యాక్స్ 7. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభించే ఈ లగ్జరీ కారు ప్రారంభ ధరను కంపెనీ రూ.26.9 లక్షలుగా ఉంచింది. ఇది ఎక్స్ షోరూం ధర. ఈ కారు బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రూ.51 వేలు టోకెన్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.


బీవైడీ ఈమ్యాక్స్ 7 (BYD eMAX 7) సుపీరియర్, ప్రీమియం అనే రెండు వేరియంట్‌లలో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 71.8 కేడబ్ల్యూహెచ్, 55.4 కేడబ్ల్యూహెచ్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జింగ్‌తో 530 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ని డెలివర్ చేస్తుందని, రెండో బ్యాటరీ ప్యాక్ 420 కిలోమీటర్ల రేంజ్‌ని డెలివర్ చేస్తుందని కంపెనీ పేర్కొన్నారు.


ఈ బీవైడీ కారు ధర ఎంత?
దీని సుపీరియర్ వెర్షన్ కేవలం 8.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే దీని ప్రీమియం వేరియంట్ 10.1 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది భారతదేశపు మొదటి 6/7 సీట్ల కారు. ఈ కారు ధర రూ. 26.9 లక్షలతో మొదలై టాప్-స్పెక్ సుపీరియర్ ట్రిమ్ రూ. 29.9 లక్షలకు చేరుకుంటుంది.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఈ కారుతో వచ్చే ఫీచర్లు ఇవే...
బీవైడీ ఈమ్యాక్స్ 7 టాప్ స్పెక్ వెర్షన్ అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో మీరు పెద్ద 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, లెవల్ 2 ఏడీఏఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ని పొందండి.


మార్కెట్‌లో దేనితో పోటీ?
కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ కారు బీవైడీ ఈ6కి భిన్నంగా ఉంటుంది. బీవైడీ నుంచి వచ్చిన ఈ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థి లేకపోయినా ధర పరంగా, ఈ ఎంపీవీ టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టోతో పోటీపడుతుంది. ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ వెర్షన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 25.97 లక్షల నుంచి మొదలవుతుంది. దీని టాప్ ఎండ్ జెడ్ఎక్స్ (వో) వేరియంట్ ధర రూ. 30.98 లక్షలుగా ఉంది. ఇది కాకుండా మారుతి సుజుకి ఇన్విక్టో ధర 25.30 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. 



Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే