GST Reforms 2025 : పండుగ సీజన్ ప్రారంభానికి ముందు, ప్రభుత్వం ద్విచక్ర వాహనాల మార్కెట్ కోసం ఒక పెద్ద ప్రకటన చేసింది. కొత్త GST రేట్ల ప్రకారం, ఇప్పుడు 350cc వరకు ఉన్న బైక్‌లపై పన్నును 18%కి తగ్గించారు. అంటే, సాధారణ కస్టమర్‌లకు చిన్న, మధ్య-శ్రేణి బైక్‌లు చౌకగా మారతాయి. అదే సమయంలో, 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్‌లను లగ్జరీ విభాగంలో ఉంచి వాటిపై పన్నును 40%కి పెంచారు. ఈ నిర్ణయం వల్ల ఎంట్రీ-లెవెల్ బైక్‌ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది, అయితే ప్రీమియం,  హై-పెర్ఫార్మెన్స్ బైక్‌ల ఔత్సాహికులు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.

Continues below advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్ చిన్న బైక్‌లు చౌకగా మారాయి

  • రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఈ మార్పు మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది. కంపెనీకి విడుదల చేసన హంటర్ 350, క్లాసిక్ 350, మీటియోర్ 350, బుల్లెట్ 350 వంటి ప్రసిద్ధ బైక్‌లు ఇప్పుడు చౌకగా మారతాయి, ఎందుకంటే వాటిపై కేవలం 18% GST మాత్రమే వేస్తున్నారు. అయితే, హిమాలయన్ 450, గొరిల్లా 450, స్క్రామ్ 440, 650cc సిరీస్ (ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ GT, సూపర్ మీటియోర్, షాట్‌గన్) లపై ఇప్పుడు 40% పన్ను బాదుతున్నారు.. దీనివల్ల వాటి ధర పెరుగుతుంది  అడ్వెంచర్-టూరర్ విభాగంలో డిమాండ్ కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు.

బజాజ్, ట్రయంఫ్ బైక్‌లపై ప్రభావం

  • బజాజ్ ఆటో డొమినార్ 400, పల్సర్ NS400Z ఇప్పుడు 40% పన్ను పరిధిలోకి వచ్చాయి. దీనితోపాటు, బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్య నమూనాలు, స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X , థ్రక్స్టన్ 400 కూడా ఖరీదైనవిగా మారతాయి. ఇప్పటివరకు, ఇవి మధ్య-సామర్థ్య విభాగంలో చవకైన ఎంపికలుగా పరిగణించారు, ఇప్పుడు పన్ను భారంతో అవి ఖరీదైనవిగా మారతాయి. 

స్ప్లెండర్ ప్లస్ ధర ఎంత తగ్గుతుంది

ప్రభుత్వ నిర్ణయం వల్ల పండుగల సమయంలో ద్విచక్ర వాహనాల కొనుగోలు మరింత వేగవంతం అవుతుంది. ఉదాహరణకు, కొత్త GST రేటు అమలులోకి వచ్చిన తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ ఎంత చౌకగా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,476. దీనిపై GSTలో దాదాపు 10% తగ్గింపు ఉంటే, ధర దాదాపు రూ. 9,800 తగ్గవచ్చు. దీనివల్ల కస్టమర్లకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది.

అయితే, బైక్ కొనేటప్పుడు ఎక్స్-షోరూమ్ ధరతోపాటు మరిన్ని ఛార్జీలు కూడా కలుస్తాయి. ఇందులో రూ. 9,540 RTO ఛార్జీలు, రూ. 8,200బీమా ప్రీమియం , దాదాపు రూ. 985 ఇతర ఛార్జీలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపితే, హైదరాబాద్‌లో  స్ప్లెండర్ ప్లస్ ఆన్-రోడ్ ధర ప్రస్తుతం దాదాపు రూ. 98,201అవుతుంది. పన్ను తగ్గింపు పూర్తిగా కనిపిస్తే, రాబోయే రోజుల్లో ఈ బైక్ మునుపటి కంటే చాలా చౌకగా మారవచ్చు.

Continues below advertisement

KTM  మొత్తం శ్రేణి ఖరీదైనదిగా ఉంటుంది

  • KTM భారతదేశంలో తన స్పోర్ట్స్ మరియు అడ్వెంచర్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది, అయితే కొత్త GST రేట్ల వల్ల దాని మొత్తం శ్రేణిపై ప్రభావం పడుతుంది. డ్యూక్ సిరీస్, RC సిరీస్, అడ్వెంచర్ సిరీస్‌లోని చాలా బైక్‌లు 350cc కంటే ఎక్కువ, వాటిపై ఇప్పుడు 40% పన్ను వేస్తారు. అంటే, పండుగ సీజన్‌లో KTM బైక్‌ల ధరలు పెరుగుతాయి, వాటి అమ్మకాలపై ఒత్తిడి పెరగవచ్చు.
  • మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ లేదా క్లాసిక్ వంటి 350cc కంటే తక్కువ ఇంజిన్ కలిగిన బైక్ కొనాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు ఈ బైక్‌లు మునుపటి కంటే చౌకగా ఉంటాయి, అయితే మీరు హిమాలయన్ 450, బజాజ్ డొమినార్ 400 లేదా KTM అడ్వెంచర్ వంటి మధ్య, హై-రేంజ్ బైక్ కొనాలని కలలుగంటే, ఇప్పుడు మీరు ఎక్కువ బడ్జెట్ ఉంచుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒకవైపు సాధారణ కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది, మరోవైపు ప్రీమియం బైక్‌ల ఔత్సాహికుల జేబులకు చిల్లు పెడుతుంది.