Best Electric Cycles Under Rs 15000: పెట్రోల్ ధరలు కొండెక్కి కూర్చున్న వేళ రోజువారీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలని చాలామంది చూస్తున్నారు. ముఖ్యంగా.. స్కూల్‌, కాలేజీ, ఆఫీస్ లేదా సమీప ప్రాంతాలకు వెళ్లివచ్చేవాళ్లకు ఎలక్ట్రిక్ సైకిళ్లు మంచి ప్రత్యామ్నాయం. తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన ఛార్జింగ్, తక్కువ వేగం వంటి కారణాలతో వీటికి డిమాండ్ పెరుగుతోంది.

Continues below advertisement

రూ.15,000 లోపు బడ్జెట్‌లో కూడా కొన్ని ఎలక్ట్రిక్ సైకిళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని మోడళ్లు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో సుమారు 20 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. గరిష్ట వేగం సాధారణంగా గంటకు 20 నుంచి 25 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అయితే, రేంజ్ అనేది బ్యాటరీ సామర్థ్యం, రైడర్ బరువు, రోడ్డు పరిస్థితులు & రైడింగ్ విధానంపై ఆధారపడి మారుతుంది.

సైకిల్ మోడల్ / బ్రాండ్బ్యాటరీ సామర్థ్యండ్రైవింగ్ రేంజ్ (ఫుల్ ఛార్జ్)గరిష్ట వేగంధర 
హీరో లెక్ట్రో సిరీస్5.8 Ah / 7.8 Ah లిథియం30 - 40 కి.మీ.25 కి.మీ./గం.₹14,999 - ₹15,999
సీ-ట్రాక్ ఎలక్ట్రిక్6.0 Ah లిథియం-అయాన్25 - 35 కి.మీ.25 కి.మీ./గం.₹13,500 - ₹14,500
డి-ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్48V లిథియం-అయాన్30 - 40 కి.మీ.25 కి.మీ./గం.₹15,000
లోకల్ ఇ-మోబిలిటీ స్టార్టప్స్5.2 Ah లిథియం-అయాన్20 - 30 కి.మీ.20 - 25 కి.మీ./గం.₹12,000 - ₹14,000

ఇది కూడా చదవండి: RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?

Continues below advertisement

హీరో లెక్ట్రో సిరీస్బడ్జెట్ ఎలక్ట్రిక్ సైకిళ్లలో హీరో లెక్ట్రో సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కొన్ని మోడళ్లలో 250 వాట్ల బీఎల్‌డీసీ రియర్‌ హబ్ మోటార్‌ అందిస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి సింగిల్‌ ఛార్జ్‌తో సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కొన్ని మోడళ్లలో బ్యాటరీ మొత్తం ఫ్రేమ్‌లో ఉంటుంది. దీనివల్ల సైకిల్‌ మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తుంది.

సీ ట్రాక్ ఎలక్ట్రిక్ సైకిళ్లుతక్కువ ధరలో రోజువారీ ప్రయాణానికి సీ ట్రాక్ వంటి మోడళ్లను కూడా పరిశీలించవచ్చు. కొన్ని సైకిళ్లలో తొలగించగల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీంతో, సైకిల్‌ నుంచి బ్యాటరీని ఇంట్లోకి తీసుకెళ్లి ఛార్జ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. సాధారణంగా మూడు నుంచి నాలుగు గంటల్లో ఛార్జింగ్ పూర్తయ్యే మోడళ్లు ఉన్నాయి.

రైడింగ్ మోడ్స్‌లో థ్రోటిల్ & పెడల్ అసిస్ట్ వంటి సదుపాయాలు ఉంటాయి. కొన్ని మోడళ్లలో క్రూయిజ్ మోడ్ కూడా కనిపిస్తుంది. రాత్రివేళ ప్రయాణానికి ఎల్‌ఈడీ హెడ్‌లైట్, భద్రత కోసం డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు అందిస్తున్నారు.

లోకల్ బ్రాండ్లు కూడా ఉన్నాయిబడ్జెట్ విభాగంలో, లోకల్‌ కంపెనీలు & కొత్త ఈ-మొబిలిటీ సంస్థలు కూడా చాలా మోడళ్లను అందిస్తున్నాయి. తక్కువ బరువుతో ఉండే సైకిళ్లు నగరం/పట్టణ ప్రయాణాల్లో సులభంగా ఉంటాయి. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయినా సాధారణ సైకిల్‌లా పెడల్స్‌తో తొక్కుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: కియా సిరోస్‌ EVకి అదిరిపోయే డిమాండ్‌.. 650కి పైగా బుకింగ్స్‌, ఒక్కరోజులోనే 150 డెలివరీలు

కొనే ముందు ఇవి చూడండిరూ.15,000 లోపు ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేసేటప్పుడు ధర ఒక్కటే ప్రమాణంగా చూడకూడదు. లిథియం అయాన్ బ్యాటరీ ఉన్న మోడల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాటరీ & మోటార్‌పై కంపెనీ అందించే వారంటీని ముందుగానే తెలుసుకోవాలి. ఫ్రేమ్ బలంగా ఉందో లేదో పరిశీలించాలి. అలాగే సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయా, విడిభాగాలు సులభంగా లభిస్తాయా అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.

ముఖ్యంగా, బ్యాటరీని తరచూ పూర్తిగా ఖాళీ చేయకూడదు, 20% మిగిలి ఉండగానే ఛార్జ్ చేయడం మంచిది. వర్షపు నీరు బ్యాటరీ & విద్యుత్ భాగాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. మీరు సరైన మోడల్‌ను ఎంచుకుంటే రోజువారీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.