Royal Enfield Classic 350 Gorkha Edition: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ డైహార్డ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌. ఈ బైక్‌ కంపెనీ, క్లాసిక్‌ 350లో కొత్త గోర్ఖా ఎడిషన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్లాసిక్‌ 350కి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు, భారత సైన్యంలోని గోర్ఖా రెజిమెంట్‌ గౌరవార్ధం ఈ ఎడిషన్‌ను రూపొందించింది. గోర్ఖా సైనికుల ధైర్యం & క్రమశిక్షణకు గుర్తుగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ.2.11 లక్షలుగా నిర్ణయించింది.

Continues below advertisement

కొత్త గోర్ఖా గ్రీన్‌ కలర్‌క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త గోర్ఖా గ్రీన్‌ కలర్‌. సైనిక వాహనాల్లో కనిపించే మిలిటరీ గ్రీన్‌ తరహా మ్యాట్‌ షేడ్‌ను ఈ బైక్‌కు ఇచ్చారు. దీంతో క్లాసిక్‌ 350 కి మరింత రఫ్‌ & రెట్రో లుక్‌ వచ్చింది.

సైడ్‌ ప్యానల్స్‌పై గోర్ఖా రెజిమెంట్‌ అధికారిక చిహ్నమైన క్రాస్‌డ్‌ ఖుక్రీలను ప్రత్యేక డిజైన్‌గా యాడ్‌ చేశారు. ఫ్యూయల్‌ ట్యాంక్‌పై గోర్ఖా ఎడిషన్‌ స్టిక్కర్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక డిజైన్లతో.. సాధారణ క్లాసిక్‌ 350తో పోలిస్తే గోర్ఖా ఎడిషన్‌ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Continues below advertisement

ఇంజిన్‌లో మార్పులు లేవులుక్‌లో మార్పులు చేసినప్పటికీ పనితీరు విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. సాధారణ క్లాసిక్‌ 350లో ఉన్న అదే 349cc సింగిల్‌ సిలిండర్‌ J-సిరీస్‌ ఇంజిన్‌ను ఇందులోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్‌ 20.2hp పవర్‌ & 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు

ఇంజిన్‌కు 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. బ్రేకింగ్‌ కోసం డ్యూయల్‌ ఛానల్‌ ABSను అందించారు. బైక్‌ ఎలక్ట్రానిక్‌ ఫీచర్లలో కూడా పెద్దగా మార్పులు లేవు. సెమీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కొనసాగుతుంది.

గోర్ఖా ఎడిషన్‌లో ట్రిప్పర్‌ పాడ్‌ ఉండదు. అవసరమైతే దీనిని యాక్సెసరీగా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది.

మరికొన్ని ఫీచర్లుగోర్ఖా ఎడిషన్‌లో అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌ను అందించారు. USB టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్‌ కూడా ఉంది. ఈ రెండు ఫీచర్లు సాధారణ క్లాసిక్‌ 350లోనూ ఇటీవల అందుబాటులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: 2026 Skoda Slavia ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌లో భలే అప్‌డేట్స్‌.. వెనుక సీట్‌లో కూర్చున్నవాళ్లకు మంచి మసాజ్‌!

ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350ను ఏడు రంగుల్లో విక్రయిస్తున్నారు. వేరియంట్లను బట్టి సింగిల్‌ ఛానల్‌ లేదా డ్యూయల్‌ ఛానల్‌ ABS అందుబాటులో ఉంటుంది. బేస్‌ వేరియంట్‌లో సింగిల్‌ ఛానల్‌ ABS ఉంటుంది. మిగిలిన వేరియంట్లలో డ్యూయల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా వస్తుంది.

ధర & బుకింగ్స్‌రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ ధర రూ.2.11 లక్షలు. క్లాసిక్‌ 350 లైనప్‌లో ఇది మధ్య స్థాయిలో ఉంటుంది. ఈ బైక్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.