BMW iX xDrive50 India Review in Telugu: కార్‌లలో BMW కి ఉన్న క్రేజే వేరు. పైగా మార్కెట్‌లోని డిమాండ్‌, ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్‌డేటెడ్‌ మోడల్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తోందీ కంపెనీ. ఎలక్ట్రిక్‌ వెహికిల్ మార్కెట్‌లోనూ అడుగు పెట్టింది. ఈ ఈవీ కార్ల సేల్స్‌ (BMW EVs) కూడా బాగానే ఉంటున్నాయి. ఈ BMW సిరీస్‌లో లేటెస్ట్‌గా క్లిక్ అయిన మోడల్ BMW iX. ఈ లగ్జరీ ఈవీ సేల్స్‌లో బెస్ట్‌గా నిలిచింది. అయితే...బ్యాటరీ కెపాసిటీ కాస్త తక్కువగా ఉందన్న కంప్లెయింట్స్ వచ్చాయి. వీటిని గమనించిన సంస్థ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచింది. కొత్తగా xDrive 50 Modelని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్ ధర రూ.1.4 కోట్లు.




భారీ బ్యాటరీతో దీన్ని డిజైన్ చేసింది. కేవలం బ్యాటరీ కెపాసిటీని పెంచడమే కాదు. లుక్‌నీ మరింత స్మార్ట్‌గా మార్చేసింది. హెడ్‌ల్యాంప్స్‌ మరింత స్లిమ్‌గా కనిపిస్తున్నాయి. ఈ xDrive 50 మోడల్ కార్స్‌కి 22 ఇంచుల అలాయ్ వీల్స్‌ని అమర్చింది. మొత్తంగా లుక్‌ మాత్రం (BMW iX xDrive50 India Review) చాలా స్టైలిష్‌గా ఉంది. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే..ఓ లగ్జరీ హోటల్‌లో కూర్చున్నంత కంఫర్ట్‌గా డిజైన్ చేశారు. ఇంటీరియర్ కోసం వినియోగించిన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తోంది. ముందు కర్వ్ షేప్‌లో భారీ డిస్‌ప్లే ఉంది. దాదాపు అన్ని ఫీచర్స్‌నీ ఇందులో నుంచి ఆపరేట్ చేసే వెసులుబాటు ఇచ్చారు. స్టీరింగ్ వీల్‌ కూడా చాలా యునిక్‌గా ఉంది. ఫోర్‌ జోన్ క్లైమేట్ కంట్రోల్, మసాజ్ పవర్డ్ సీట్స్, హెడ్స్ అప్ డిస్‌ప్లే సహా మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని ఇందులో జోడించింది BMW. ఇంటీరియర్ స్పేస్‌ విషయంలోనూ ఎక్కడా రాజీ పడలేదు. 




భారీ బ్యాటరీ కెపాసిటీ 


బ్యాటరీ కెపాసిటీని 111.5 kWh కి పెంచారు. అంతే కాదు. 516bhp,765Nm సామర్థ్యం ఉన్న డ్యుయల్ మోటర్‌నీ చేర్చింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్‌ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించొచ్చని కంపెనీ చెబుతోంది. అయితే...కొందరు ఎక్స్‌పర్ట్‌లు మాత్రం ఈ రేంజ్‌ని 500 కిలోమీటర్లుగా చెబుతున్నారు. గత iX మోడల్‌తో పోల్చుకుంటే ఈ రేంజ్ చాలా ఎక్కువ. మోటర్ కాన్ఫిగరేషన్ మారడం వల్ల డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్‌గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఖాళీ రోడ్లలో Sport Mode యాక్టివేట్ చేసుకోవచ్చు.





ఈ మోడ్‌లో కార్ చాలా వేగంగా దూసుకుపోతుంది. దాదాపు 200 కిలోల బరువున్న ఓ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో ఇలా స్పోర్ట్స్‌ మోడ్‌ ఉండడమే చాలా స్పెషల్. AC ఛార్జర్‌తో అయితే 11 గంటల పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదే DC ఛార్జర్‌తో అయితే కేవలం 35 నిముషాల్లో ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ పెంచడంతో పాటు ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్స్‌తో డిజైన్ చేయడం వల్ల అందుకు తగ్గట్టుగా ధర పెంచింది. లగ్జరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ కోసం వెతికే వాళ్లకి ఈ BMW xDrive 50 Model బెస్ట్ ఆప్షన్‌గా కనిపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 


Also Read: Mahindra XUV 3XO Launch Date: పనోరమిక్ సన్‌రూఫ్‌తో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో - మరో వారంలో లాంచ్!