Mahindra XUV 3XO India Launch: మహీంద్రా తన ఎక్స్‌యూవీ300కి కొత్త రూపాన్ని ఇస్తుంది. అప్‌డేట్ చేసిన ఫీచర్లు, కొత్త పేరుతో పూర్తి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను లాంచ్ చేస్తుంది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఏప్రిల్ 29వ తేదీన భారతదేశంలో అధికారికంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. లాంచ్‌కు ముందు మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కొన్ని ఫీచర్‌లతో పాటు డిజైన్ ఎలిమెంట్‌లను కూడా టీజ్ చేసింది.
టీజర్‌లో ఏం చూశారు?
ఇప్పటివరకు విడుదల అయిన టీజర్‌లలో చూపినట్లుగా, కొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో సెగ్మెంట్ ఫస్ట్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది. ఇది కాకుండా వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ ద్వారా రిమోట్ ఏసీ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ వంటి లక్షణాలను పొందుతుంది. ఇది చూడటానికి ఎక్స్‌యూవీ400 లాగా ఉండవచ్చు.
కొత్త ఫీచర్లు అందుబాటులోకి
ఇది కాకుండా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వోలో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, లేన్ వాచ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లను పొందుతుందని తెలుస్తోంది.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
ఇంజిన్ ఇలా...
ఈ ఎస్‌యూవీ 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో సహా అదే ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఉంటాయి. లాంచ్ అయిన తర్వాత మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో... టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్‌లతో పోటీపడుతుంది. టాటా నెక్సాన్ ఒక డీజిల్, ఒక పెట్రోల్ ఇంజన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది. రెండు ఇంజన్లు మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తాయి. టాటా మోటార్స్ గత ఏడాది ఈ ఎస్‌యూవీకి ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ను ఇచ్చింది.
ఈవీ మోడల్ కూడా మార్కెట్లోకి
ఇది కాకుండా మహీంద్రా తన ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిని ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సెగ్మెంట్ లీడర్ టాటా నెక్సాన్ ఈవీకి ప్రత్యర్థిగా ఉంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 465 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు