బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ స్టైలిష్ స్పోర్ట్స్ బైక్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర మనదేశంలో రూ.2.85 లక్షలుగా ఉంది. ఇందులో జీ 310 ఆర్ఆర్ స్టైల్ మోడల్ కూడా వచ్చింది. ఈ వేరియంట్ ధరను రూ.2.99 లక్షలుగా నిర్ణయించారు. ఇవి ఎక్స్-షోరూం ధరలే.
ఈ కొత్త బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ రెండు రంగుల్లో లాంచ్ అయింది. రేసింగ్ బ్లూ మెటాలిక్, రేసింగ్ రెడ్ యూని రంగుల్లో ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్‌లో ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, పెద్ద ట్రాన్స్‌పరెంట్ విజర్, ప్యూర్ బ్లాక్ హ్యాండిల్ బార్స్, ఐదు అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వాటర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ 313 సీసీ ఇంజిన్‌ను ఈ బైక్‌లో అందించారు. 34 హెచ్‌పీ, 27 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది అందించనుంది. గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకన్లలోనే అందుకోనుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఇందులో అందించనున్నారు. ట్రాక్, అర్బన్, రెయిన్, స్పోర్ట్ మోడ్స్ ఈ బైక్‌లో ఉన్నాయి. ఈ బైక్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ప్లస్‌తో పోటీ పడనుంది. కానీ ఈ రెండిటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అయితే బీఎండబ్ల్యూకి ఉన్న ప్రీమియం ట్యాగ్ దానికి పెద్ద ప్లస్ అవుతుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?