Top EV Manufacturers in India: 2023లో మనదేశంలో ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ బాగా పెరిగాయి. నగరాల్లోని వినియోగదారులు రోజువారీ అవసరాల కోసం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కార్ల కంపెనీలు కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల తయారీపై బాగా దృష్టి పెట్టాయి. కానీ వినియోగదారులు ఏ బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు? ఏ కంపెనీల కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి? మనదేశంలో టాప్ ఎలక్ట్రిక్ బ్రాండ్స్ ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం.


1. టాటా మోటార్స్ (టాటా.ఈవీ)
టాటా మోటార్స్ ఇటీవలే తన ఈవీ వింగ్ పేరును టాటా.ఈవీగా మార్చింది. ప్రస్తుతం మనదేశంలో టాటా మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అవే నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ. ఈ నెలలోనే టాటా పంచ్ ఈవీ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం మనదేశంలో టాటా నంబర్ వన్ కార్ల బ్రాండ్‌గా నిలిచింది.


2. ఎంజీ మోటార్ ఇండియా
ఎంజీ మోటార్స్ కూడా మనదేశంలో మంచి గ్రోత్‌ను చూపించింది. ప్రస్తుతం మనదేశంలో రెండు ఎంజీ మోటార్స్ కార్లు ఉన్నాయి. అవే ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్‌నే. దీంతో ప్రస్తుతం మనదేశంలో ఎంజీ ఎలక్ట్రిక్ కార్ల బ్రాండ్‌లో రెండో స్థానంలో ఉంది.


3. మహీంద్రా
మహీంద్రా పోర్ట్‌ఫోలియోలో కేవలం ఒక్క కారు మాత్రమే ఉంది. అదే ఎక్స్‌యూవీ400. ఈ ఒక్క కారుతోనే దేశంలోనే టాప్ ఎలక్ట్రిక్ బ్రాండ్లలో మహీంద్రా మూడో స్థానంలో నిలిచింది.


4. హ్యుందాయ్ మోటార్స్
హ్యుందాయ్ ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తుంది. అవే హ్యుందాయ్ అయోనిక్ 5, హ్యుందాయ్ కోనా ఈవీ. ఇవి రెండూ అంత ఎక్కువ ఫేమస్ కాదు. దీంతో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లలో హ్యుందాయ్ నాలుగో స్థానంలో ఉంది.


5. సిట్రోయెన్
సిట్రోయెన్ కూడా మనదేశంలో కేవలం ఒక్క ఎలక్ట్రిక్ కారునే విక్రయిస్తుంది. అదే సిట్రోయెన్ ఈసీ3. ఈ కారుతో భారతీయ ఎలక్ట్రిక్ బ్రాండ్లలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది.


6. బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్)
చైనా బ్రాండ్ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) మనదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. అవే అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, ఈ6 ఎంపీవీ. ఈ రెండు కార్ల విక్రయాలతో బీవైడీ టాప్ ఎలక్ట్రిక్ బ్రాండ్లలో ఆరో స్థానంలో ఉంది.


మరోవైపు టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును లాంచ్ చేయనుంది. ఈ నెలలోనే టాటా పంచ్ ఈవీ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. ఈ కారు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉండనుందని సమాచారం. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే తక్కువ ధరలో పంచ్ ఈవీని ఉంచుతుంది. పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో మార్కెట్లోకి వస్తుంది. ఇందులో మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ ఉండనున్నాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!