Best Budget Mileage Diesel Cars: మనదేశంలో పెట్రోల్ కార్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. కానీ ఒకప్పుడు బైక్‌లు అంటే పెట్రోల్‌తో నడుస్తాయి. కార్లు అంటే డీజిల్‌తోనే నడుస్తాయి అన్నట్లు ఉండేవి. ఇప్పటికీ చాలా మంది డీజిల్ కార్లను మాత్రమే కొనుగోలు చేయాలని చూసేవారు ఉంటారు. బడ్జెట్‌లో మంచి మైలేజీని ఇచ్చే డీజిల్ కార్ల కోసం చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. మీరు అలాంటి వారు అయితే కిందనున్న ఈ టాప్-5 లిస్టుపై ఓ లుక్కేయండి.


1. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
ఈ కారు 24 కిలోమీటర్ల వరకు మైలేజీని అందించనుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.6.6 లక్షల నుంచి ప్రారంభం కానుంది. డీజిల్‌లో మంచి మైలేజ్ ఉన్న కారు కావాలంటే ఫస్ట్ ఆప్షన్ కింద ఇదే కారు ఉంచుకోవడం బెస్ట్.


2. మహీంద్రా బొలెరో (Mahindra Bolero)
రూ.10 లక్షల్లోపు అందుబాటులో ఉన్న సెవెన్ సీటర్ డీజిల్ కార్లు ఇవే. వీటి ధర రూ.9.62 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 16 కిలోమీటర్ల వరకు బొలెరో నియో మైలేజీని అందిస్తుంది. 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్ ఇందులో ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే దీన్ని కొనుగోలు చేయవచ్చు.


3. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV300)
దీని డీజిల్ వేరియంట్ 20 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీని ధర రూ.9.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్‌ను అందించారు. 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో ఈ కారు కొనుగోలు చేయవచ్చు.


4. కియా సోనెట్ (Kia Sonet)
ఎక్కువ ఫీచర్లు ఉండే డీజిల్ కార్లలో కియా సోనెట్ ముందంజలో ఉంటుంది. దీని ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 18.2 కిలోమీటర్ల మైలేజీని ఈ కారు అందించనుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అందించారు. ఐఎంటీ, 6 స్పీడ్ ఏటీ గేర్ బాక్స్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది.


5. టాటా నెక్సాన్ (Tata Nexon)
ఈ కారు డీజిల్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.9.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ కారు ఏకంగా 23.23 కిలోమీటర్ల మైలేజీని అందించనుంది. 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌ను ఈ కారులో అందించారు. 6 స్పీడ్ ఎంటీ, ఏఎంటీ వేరియంట్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు.


మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హిమాలయన్ ఎలక్ట్రిక్ వెర్షన్‌తో ఎలక్ట్రిక్ బైకుల సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధం అవుతోంది. ఈ బైకును ఈఐసీఎంఏ 2023 షోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రదర్శించింది. ఇది ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ మోడల్. భవిష్యత్‌లో లాంచ్ కానున్న మోడళ్లకు ఒక టెస్టింగ్ మ్యూల్ కానుంది. అంటే బయటకు వచ్చే మోడల్ కొంచెం కొత్తగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ హిమాలయన్ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌లో ఉండే ఇంజిన్‌ను కంపెనీ స్వయంగా రూపొందించనుంది. బ్యాటరీ సైజు, రేంజ్ గురించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!