Top 3 CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కారణంగా ప్రజలు ఇప్పుడు సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే సీఎన్‌జీ కార్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మైలేజీ పరంగా చాలా మెరుగ్గా ఉన్నాయి. రూ. 8 లక్షల కంటే తక్కువ ధర కలిగిన మారుతి సుజుకి టాప్ 3 చవకైన సీఎన్‌జీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్‌జీ (Maruti Suzuki Alto K10 CNG)
మొదటి స్థానంలో మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్‌జీ ఉంది. ఇది భారతదేశంలోని ప్రముఖ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. దీని సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 5.96 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్). ఆల్టో కే10 సీఎన్‌జీ 33.85 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని వేరియంట్ మారుతి ఆల్టో కే10 ఎల్ఎక్స్ఐ (వో) ఎస్-సీఎన్‌జీ. 



Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!


మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ (Maruti Suzuki WagonR CNG)
మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ కారులో 1.0 లీటర్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 57 బీహెచ్‌పీ పవర్, 89 బీహెచ్‌పీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీని మైలేజీ కిలోకు 32.52 కిలోమీటర్ల నుంచి మొదలై 34.05 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వ్యాగన్ఆర్ సీఎన్‌జీలో ఎల్‌ఎక్స్‌ఐ (రూ. 6.42 లక్షలు), వీఎక్స్‌ఐ (రూ. 7.23 లక్షలు) వేరియంట్‌లు ఉన్నాయి.


మారుతీ సుజుకి సెలెరియో సీఎన్‌జీ (Maruti Suzuki Celerio CNG)
మూడో స్థానంలో మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ ఉంది. ఇది సీఎన్‌జీ కార్లలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు. ఇది 34.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6.69 లక్షలుగా ఉంది. దీని రన్నింగ్ కాస్ట్ మోటార్ సైకిల్ రన్నింగ్ ఖర్చు కంటే కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.


ఈ మూడు సీఎన్‌జీ కార్లు అద్భుతమైన మైలేజీతో పాటు అందుబాటు ధరలో లభిస్తున్నాయి. మీరు కొత్త సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ కార్లలో ఏవైనా మీ బడ్జెట్‌కు సరిపోతాయి. సీఎన్‌జీ కార్లు మీ ప్రయాణాన్ని చవకగా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.



Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?