CNG Cars Under 10 Lakh: ప్రస్తుతం భారత మార్కెట్లో సీఎన్‌జీ కార్ల ట్రెండ్ బాగా పెరిగింది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా రూ.10 లక్షల్లోపు కొత్త సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని బెస్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.


మారుతి బ్రెజ్జా సీఎన్‌జీ (Maruti Brezza CNG)
మారుతి బ్రెజ్జా లైనప్‌లో ఎల్ఎక్స్ఐ ఎస్-సీఎన్‌జీ వేరియంట్ ధర రూ. 9.29 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంది. ఇందులో 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది సీఎన్‌జీలో 25.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి బ్రెజ్జా ఎల్ఎక్స్ఐ ఎస్-సీఎన్‌జీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఎక్సుబరెంట్ బ్లూ, పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, బ్రేవ్ ఖాకీ, మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, పర్ల్ ఆర్కిటిక్ వైట్ రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది.


మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ (Maruti Fronx CNG)
మారుతి ఫ్రాంక్స్ సిగ్మా ట్రిమ్ 1.2 లీటర్ సీఎన్‌జీ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.46 లక్షలుగా ఉంది. ఇది సీఎన్‌జీలో 28.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి ఫ్రాంక్స్ సిగ్మా 1.2 సీఎన్‌జీ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ మోడల్ అందుబాటులో ఉంది. ఇది నెక్సా బ్లూ (సెలెస్టియల్), గ్రాండియర్ గ్రే, ఎర్టెన్ బ్రౌన్, ఓపులెంట్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్ అనే ఆరు కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది.


మారుతి బలెనో సీఎన్‌జీ (Maruti Baleno CNG)
మారుతి బలెనో డెల్టా ఎంటీ సీఎన్‌జీ ఈ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్‌గా ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.40 లక్షలుగా ఉంది. ఇది 30.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, నెక్సా బ్లూ, గ్రాండ్యుర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, లక్స్ బీజ్, ఓపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్ రంగులలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


హ్యుందాయ్ ఆరా సీఎన్‌జీ (Hyundai Aura CNG)
హ్యుందాయ్ ఆరా ఎస్ 1.2 సీఎన్‌జీ దాని లైనప్‌లో సీఎన్‌జీ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.31 లక్షలుగా ఉంది. దీని ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మొత్తం ఆరు రంగులలో అందుబాటులో ఉంది. వీటిలో టీల్ బ్లూ, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్ ఉన్నాయి.


టాటా టిగోర్ సీఎన్‌జీ (Tata Tigor CNG)
టాటా టిగోర్‌లో ఎక్స్ఎం వేరియంట్లో సీఎన్‌జీ మోడల్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.75 లక్షలుగా ఉంది. ఇది 26.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టాటా టిగోర్ సీఎన్‌జీ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌లో అందుబాటులో ఉంది. అరిజోనా బ్లూ, డేటోనా గ్రే, మాగ్నెటిక్ రెడ్, మెటోర్ బ్రాంజ్, ఒపాల్ వైట్ వంటి కలర్ ఆప్షన్‌లలో టాటా టిగోర్ సీఎన్‌జీ కారును కొనుగోలు చేయవచ్చు.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!