Best CNG Cars Real World Mileage: భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో, చాలా మంది CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయడమే కాకుండా, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తున్నాయి కాబట్టి ఈ సెగ్మెంట్‌కి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్, ఇటీవల, మార్కెట్‌లో ఉన్న టాప్ CNG కార్లను టెస్ట్ చేసి, రియల్ వరల్డ్ మైలేజ్ ఫిగర్స్‌ను వెల్లడించింది. అందులో మారుతి, టాటా, హ్యుందాయ్ కంపెనీల మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి డీటైల్స్ ఒక్కసారి చూద్దాం.
Tata Nexon CNGటాటా నెక్సాన్ CNG భారతదేశంలో టర్బో ఇంజిన్‌తో వచ్చిన ఏకైక CNG SUV. 100hp పవర్, 170Nm టార్క్‌ను ఇది ఇస్తుంది. ARAI ప్రకారం ఇది 24km/kg ఇస్తుందని చెబుతుంటే, రియల్ వరల్డ్ టెస్ట్‌లో 18.55km/kg మాత్రమే రికార్డ్ అయింది. నగరంలో 13.4km/kg, హైవేపై 23.7km/kg మైలేజ్ చూపించింది. దీని ధరలు ₹8.23 లక్షల నుంచి ₹13.08 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Brezza CNGమారుతి బ్రెజ్జా CNG కూడా కాంపాక్ట్ SUVగా మంచి ఫేమస్. 1.5 లీటర్ ఇంజిన్‌తో 88hp పవర్, 122Nm టార్క్ ఇస్తుంది. ARAI క్లెయిమ్ 25.5km/kg కాగా, రియల్ టెస్ట్‌లో 22.95km/kg వచ్చింది. ప్రస్తుత ధరలు ₹9.17 లక్షల నుంచి ₹11.46 లక్షల వరకు ఉన్నాయి.
Tata Altroz CNGహ్యాచ్‌బ్యాక్‌లలో టాప్‌గా నిలిచే టాటా ఆల్ట్రోజ్, ట్విన్ సిలిండర్ CNG టెక్నాలజీతో పెర్ఫార్మ్ చేస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్‌తో 74hp పవర్, 104Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ARAI క్లెయిమ్ 27.8km/kg కాగా, రియల్ వరల్డ్ టెస్ట్‌లో 25.11km/kg వచ్చింది. ఈ కారు ధరలు ₹7.22 లక్షల నుంచి ₹10.15 లక్షల వరకు ఉన్నాయి.
Tata Punch CNGటాటా పంచ్ CNG కూడా అదే 1.2 లీటర్ ఇంజిన్, ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ARAI సర్టిఫై చేసిన ప్రకారం 26.99km/kg మైలేజ్ అని చెబుతుంటే, వాస్తవ ప్రపంచంలో ఇది 25.85km/kg గా రికార్డ్ అయింది. ధరలు ₹6.68 లక్షల నుంచి ₹9.30 లక్షల వరకు ఉన్నాయి.
Hyundai Exter CNGటాటా పంచ్‌కి డైరెక్ట్ రైవల్‌గా వచ్చిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG, ట్విన్ సిలిండర్ ఆప్షన్‌తో పని చేస్తుంది. దీని 1.2 లీటర్ ఇంజిన్ 69hp పవర్, 95Nm టార్క్ ఇస్తుంది. ARAI సర్టిఫైడ్ మైలేజ్ నంబర్ 27.1km/kg కాగా, రియల్ టెస్ట్‌లో 26.55km/kg ఇచ్చింది. ధరలు ₹6.87 లక్షల నుంచి ₹9.61 లక్షల వరకు ఉన్నాయి.
Maruti Swift CNGఇక చివరగా, మారుతి స్విఫ్ట్ CNG అన్ని కార్లను దాటేసి బెస్ట్ మైలేజ్ ఇస్తోంది. ఈ కారులోని 1.2 లీటర్ ఇంజిన్, 70hp పవర్, 102Nm టార్క్ ఇస్తుంది. ARAI ప్రకారం 32.85km/kg మైలేజ్ అని చెబుతుంటే, రియల్ వరల్డ్ టెస్ట్‌లో 27.87km/kg రికార్డ్ అయింది. ప్రస్తుత ధరలు ₹7.45 లక్షల నుంచి ₹8.39 లక్షల వరకు ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, రియల్ వరల్డ్ మైలేజ్‌లో మారుతి స్విఫ్ట్ CNG అగ్రస్థానంలో నిలిచింది. దాని తర్వాత హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ కూడా మంచి నంబర్సే ఇచ్చాయి. నగరంలో డైలీ యూజ్‌కి CNG కార్లు చాలా సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు.