Most Selling Hatchback Cars August 2025: హ్యాచ్‌బ్యాక్ కార్ల విభాగంలో అనేక మోడళ్లు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయి & వాటిలో చాలా కార్లు లాంచ్ నుంచి ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అలాంటిదే. ఆగస్టు 2025లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ ఇది. Tata Tiago & Toyota Glanza అమ్మకాలు కూడా పెరిగాయి. వాటి అమ్మకాల నివేదికలను అర్ధం చేసుకుందాం.
Maruti Wagon R ఆగస్టు 2025లో, మారుతి వ్యాగన్ ఆర్, దేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. ఆ నెలలో కంపెనీ మొత్తం 14,552 యూనిట్లను విక్రయించింది. అయితే, గత సంవత్సరం ఇదే కాలంలోని (ఆగస్టు 2024) 16,450 యూనిట్లతో పోలిస్తే ఇప్పటి సంఖ్య తగ్గింది, ఇది దాదాపు 12% తగ్గుదలను సూచిస్తుంది. అయినప్పటికీ, దాని బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రైస్ & ప్రాక్టికల్ డిజైన్ కారణంగా వ్యాగన్ ఆర్ ఇప్పటికీ ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉంది.
Maruti Suzuki Balenoరెండో స్థానంలో మారుతి బాలెనో ఉంది, ఆగస్టు 2025లో 12,549 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య ఆగస్టు 2024లో అమ్ముడైన 12,485 యూనిట్ల కంటే స్వల్పంగా ఎక్కువ, ఇది సంవత్సరానికి సుమారు 1% వృద్ధిని సూచిస్తుంది. ఆకర్షణీయమైన డిజైన్ & అధునాతన ఫీచర్లతో, బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఒక పాపులర్ ఆప్షన్‌గా కొనసాగుతోంది.
Maruti Suzuki Swift మారుతి స్విఫ్ట్ ఆగస్టు 2025లో 12,385 యూనిట్లు అమ్ముడుపోయి మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టులో అమ్మకాలు 12,844 యూనిట్లు, ఇప్పుడు ఇది 4% క్షీణత. అయినప్పటికీ, దాని స్టైలిష్ అట్రాక్షన్ & అత్యుత్తమ పనితీరు కారణంగా స్విఫ్ట్ కస్టమర్ల అభిరుచిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.
Maruti Suzuki Altoఒకప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు 'ఆల్టో'కు ఇప్పుడు ప్రజాదరణ క్రమంగా తగ్గుతోంది. ఆగస్టు 2025లో కేవలం 5,520 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఆగస్టు 2024లో 8,546 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీని అర్థం ఆల్టో అమ్మకాలు దాదాపు 35% తగ్గాయి.
Tata Tiago టాటా టియాగో ఆగస్టు 2025లో 5,250 యూనిట్లు అమ్ముడై, ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉంది. ఆగస్టు 2024లో అమ్ముడైన 4,733 యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య సుమారు 11% పెరుగుదల. టియాగో దాని అత్యుత్తమ నిర్మాణ నాణ్యత & సేఫ్టీ రేటింగ్‌ల కారణంగా వినియోగదారులలో ఒక పాపులర్ ఆప్షన్.
ఇతర హ్యాచ్‌బ్యాక్‌లుఆగస్టు 2025లో, ఈ టాప్-5 కార్లతో పాటు, ఇతర ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లు కూడా బలమైన అమ్మకాలను నమోదు చేశాయి. Toyota Glanza 5,102 యూనిట్లను విక్రయించగా, Tata Altroz 3,959 యూనిట్లు అమ్ముడైంది. Hyundai Grand i10 Nios 3,908 యూనిట్లను, Hyundai i20 3,634 యూనిట్లను విక్రయించింది. Maruti Suzuki Ignis కూడా 2,097 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.