Best Cars Under 7 Lakhs: మీరు కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నారా.. మీ బడ్జెట్‌ 7 లక్ష రూపాయల బడ్జెట్‌ అయితే ఇక్కడ కొన్ని కార్లను లిస్ట్ అవుట్ చేశాం వాటిలో మీకు నచ్చిన కారును ఒక్కసారి పరిశీలించండి. భారత మార్కెట్లో చాలా గొప్ప కార్లు అందుబాటులో ఉన్నాయి. ది బెస్ట్ ఎంపిక చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది కానీ బడ్జెట్ అందుకు సహకరించదు. అందుకే ఎవరికి నచ్చిన బడ్జెట్‌ వాళ్లు బెస్ట్‌ అఫర్డబుల్‌ ప్రైస్‌లో కార్లు చూసుకుంటారు. అలా మీరు ఏడు లక్షల రూపాయల బడ్జెట్‌తో కారు కొనాలని సిద్ధమైనప్పుడు సరసమైన ధరలో మంచి కారులను ఇక్కడ ఇస్తున్నాం. ఒక్కసారి పరిశీలించండి. 

ఇక్కడ ఇస్తున్న లిస్ట్‌లో మారుతి నుంచి మహేంద్ర వరకు చాలా కంపెనీలు ఉన్నాయి. వాటి ఫీచర్స్ కూడా ఇస్తున్నాం. లేటెస్ట్ ఫీచర్స్‌తో మీకు అందుబాటు ధరల్లో ఉండే కార్ల గురించి ఒక్కసారి తెలుసుకోండి. ఏ కారు కొనాలనే డైలమాలో ఉన్న మీకు ఓ దారి దొరుకుతుంది. 

మహీంద్రా XUV 3XOఇలా ఏడు లక్షల్లో కారు కొనాలనుకునే వాళ్లకు మహీంద్రా XUV 3XO కూడా ఒక గొప్ప ఎంపిక. సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, మంచి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మంచి క్వాలిటీ బాడీని కలిగి ఉందీ కారు వేరియంట్‌. భద్రత కోసం, ఇది ABS, EBD, డ్రైవర్, కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లు దీనికి ఇచ్చారు. దీని ధర దాదాపు రూ.7.49 లక్షల వరకు ఉంటుంది. దీని కనెక్టివిటీ ఫీచర్లలో స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్, నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి. XUV 3XO 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 115 bhp శక్తిని, 300 Nm టార్క్ ఇస్తుంది.

Also Read: ధర, ఫీచర్లు , పవర్‌ట్రెయిన్ పరంగా కియా సిరోస్‌, స్కోడా కైలాక్‌లో ఏ కారు మంచిది?

హ్యుందాయ్ ఎక్స్‌టర్హ్యుందాయ్ Xeter ప్రీమియం ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన సీట్లు, USB ఛార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు కూడా ఇచ్చారు. దీని కనెక్టివిటీ ఫీచర్లలో స్మార్ట్ రివర్స్ కెమెరా, బ్లూటూత్, ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. ఎక్స్‌టర్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 83 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీని మైలేజ్ లీటరుకు 19-21 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కారు ధర సుమారు రూ. 6.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

టయోటా గ్లాంజామీ బడ్జెట్‌లో చూసుకుంటే టయోటా గ్లాంజా కూడా మంచి ఎంపిక. ఇందులో విలాసవంతమైన ఇంటీరియర్స్, సాఫ్ట్ టచ్ డ్యాష్‌బోర్డ్ ఉంది. మంచి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉంది. ABS, వెనుక డీఫాగర్ వంటి లక్షణాలను కలిగి ఉంది. దీని కనెక్టివిటీ ఫీచర్లలో స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బ్లూటూత్, యాపిల్ కార్ప్లే ఉన్నాయి. దీని ధర రూ.6.86 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గ్లాన్జాలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 90 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది.

మారుతీ సుజుకి ఫ్రాంక్స్మారుతి సుజుకి ఫ్రంట్ఎక్స్ చాలా మంచి ఎంపిక. ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కలిగి ఉండి స్మార్ట్ లుక్‌తో వస్తోంది. భద్రత కోసం ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (బ్రేకింగ్ సిస్టమ్), వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. దీని కనెక్టివిటీ ఫీచర్లలో స్మార్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, బ్లూటూత్, USB పోర్ట్‌లు కూడా ఉన్నాయి. ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది దాదాపు 90 bhp పవర్‌ను, 113 Nm టార్క్ ఇస్తుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మైలేజ్ లీటరుకు 20-22 కిలోమీటర్‌లు ఇస్తుందని చెబుతున్నారు. మీరు మీ బడ్జెట్‌ను రూ. 7 లక్షల కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటే, ఈ కారును కొనుగోలు చేయవచ్చు, ఎందుకంటే ఈ కారు ధర రూ. 8.37 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు అదిరిపోయే మైలేజీ, ఫీచర్లు ఉండే బైక్‌లు ఇవే