Best Cars Under 15 Lakh: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో కార్లకు డిమాండ్ చాలా పెరిగింది. దీని కారణంగా వివిధ ధరల రేంజ్‌ల్లో ఆప్షన్ల సంఖ్య కూడా పెరిగింది. మీరు కూడా రూ.15 లక్షల లోపు కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ రేంజ్‌లో కొన్ని బెస్ట్ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.


మహీంద్రా థార్
మహీంద్రా థార్ మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (152 పీఎస్ పవర్/300 ఎన్ఎం పీక్ టార్క్), 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ (132 పీఎస్ పవర్/300 ఎన్ఎం పీక్ టార్క్) ఉన్నాయి. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. అదనంగా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ (118 పీఎస్ పవర్/300 ఎన్ఎం పీక్ టార్క్) ఆర్‌డబ్ల్యూడీ మోడల్‌లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది.


హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 1.5 లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ (115 పీఎస్ పవర్/144 ఎన్ఎం పీక్ టార్క్) సీవీటీతో 6 స్పీడ్ ఎంటీ, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 పీఎస్ పవర్/253 ఎన్ఎం పీక్ టార్క్) 7 స్పీడ్ డీసీటీ ఉన్నాయి. 1.5 లీటర్ డీజిల్ (116 పీఎస్ పవర్/250 ఎన్ఎం పీక్ టార్క్) 6 స్పీడ్ ఎంటీ, 6 స్పీడ్ ఏటీతో లభిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20.15 లక్షల మధ్య ఉంటుంది.


టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లను పొందుతుంది. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ (120 పీఎస్ పవర్/170 ఎన్ఎం పీక్ టార్క్), 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ (115 పీఎస్ పవర్/260 ఎన్ఎం పీక్ టార్క్) ఉన్నాయి. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ, కొత్త 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డీసీటీ) నాలుగు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో కూడా అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.10 లక్షల నుంచి రూ.15.60 లక్షల వరకు ఉంది.


మారుతి సుజుకి బ్రెజా
మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ (103 పీఎస్ పవర్/137 ఎన్ఎం పీక్ టార్క్)తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని సీఎన్‌జీ వేరియంట్ తక్కువ పవర్ అవుట్‌పుట్ (88 పీఎస్ పవర్/121.5 ఎన్ఎం పీక్ టార్క్) అందిస్తుంది. ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 14.14 లక్షల మధ్య ఉంటుంది.


మారుతీ సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ (103 పీఎస్ పవర్/137 ఎన్ఎం పీక్ టార్క్) మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో, 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఇది కాకుండా సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 88 పీఎస్ పవర్, 121.5 ఎన్ఎం పీక్ టార్క్ పవర్ అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.68 లక్షల నుంచి రూ. 13.08 లక్షల మధ్య ఉంటుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!