Best 7 Seater Cars After GST For Diwali 2025: భారతదేశంలో GST తగ్గింపు తర్వాత, ఆటో మార్కెట్ కామన్ మ్యాన్‌కు మరింత అందుబాటులోకి వచ్చింది & ఎక్కువ ఎంపికలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత నెలలో (ఆగస్టు 2025), మారుతి ఎర్టిగా, మహీంద్రా స్కార్పియో, టయోటా ఇన్నోవా, మహీంద్రా బొలెరో, కియా కారెన్స్ వంటి 7-సీటర్ కార్లు.. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు & SUVలు సహా అన్ని విభాగాలలోని వాహనాల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది, మన మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తుంది.
ఈ దసరా లేదా దీపావళి నాటికి మీరుమీ కుటుంబం కోసం ఒక బెస్ట్ 7-సీటర్ కారు కొనాలని ఆలోచిస్తుంటే, ఇక్కడ టాప్ 5 ఆప్షన్లు ఉన్నాయి. GST తగ్గింపు తర్వాత ఈ కార్ల ధరలు ఎంత దిగి వచ్చాయో కూడా వివరంగా ఉంది.
మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga)గత నెలలో (ఆగస్టు 2025), మొత్తం 18,445 మంది కొత్త కస్టమర్లు మారుతి సుజుకి ఎర్టిగాను కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో, మారుతి ఎర్టిగా కొత్త ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర (Maruti Suzuki Ertiga New Price After GST) రూ. 8.80 లక్షలు (సుమారు $ 9,950). కొత్త GST శ్లాబ్ అమలు తర్వాత ఇది రూ. 46,400 తగ్గింది.
మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)ఆగస్టు 2025లో 9,840 యూనిట్లు అమ్ముడైన మహీంద్రా స్కార్పియో, ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. GST 2.0 సంస్కరణల అమలు తర్వాత, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో, మహీంద్రా స్కార్పియో ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్), ఇప్పుడు రూ. 13.20 లక్షలు (Mahindra Scorpio New Price After GST).
టయోటా ఇన్నోవా (Toyota Innova)గత నెలలో, 9,304 యూనిట్లు అమ్ముడైన టయోటా ఇన్నోవా, థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. GST 2025 సంస్కరణ కారణంగా ఈ ప్రీమియం MPV ధర దాదాపు రూ. 1.80 లక్షలు దిగి వచ్చింది, మిడిల్ క్లాస్ కస్టమర్ల కోసం అదనపు పండుగ ఆనందాన్ని తెచ్చింది.
మహీంద్రా బొలెరో (Mahindra Bolero)మహీంద్రా కాంపాక్ట్ SUV బొలెరో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో, మొత్తం 8,109 యూనిట్ల మహీంద్రా బొలెరోలు అమ్ముడయ్యాయి. కొత్త GST తర్వాత, మహీంద్రా బొలెరో కొనే ప్రతి కస్టమర్ దాదాపు రూ. 1.27 లక్షల తగ్గింపును పొందుతారు.
కియా కారెన్స్ (Kia Carens)ఐదో స్థానంలో ఉన్న కియా కారెన్స్, కియా ఇండియా తీసుకొచ్చిన తక్కువ ధర 7-సీట్ల కారు. దీనిని, గత నెలలో మొత్తం 6,822 మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు. కారెన్స్ అమ్మకాలు గత సంవత్సరంతో (ఆగస్టు 2024) పోలిస్తే 16% పెరిగాయి. GST తగ్గింపు తర్వాత, కియా కారెన్స్ రూ. 48,000 వరకు తక్కువకు అందుబాటులో ఉంది. దీని అర్ధం, ఇప్పుడు ఈ కారు కొనేవాళ్లకు దాదాపు రూ. అర లక్ష వరకు ఆదా అవుతుంది.