Brahmamudi Serial Today Episode: హాస్పిటల్‌లో ఎవరో వ్యక్తి తన భార్యను అబార్షన్‌ చేయించుకో అని చెప్తుంటే రాజ్‌ విని వాళ్లను తిడతాడు. వాళ్లతో గొడవ పడతాడు. ఇంతలో కళ్యాణ్‌ వచ్చి రాజ్‌ను బయటకు తీసుకెళ్తాడు.

Continues below advertisement

కళ్యాణ్‌: అన్నయ్య అసలేం చేస్తున్నావు నువ్వు వాళ్లతో ఎందుకు గొడవ పడుతున్నావు

రాజ్‌: వాళ్లు బిడ్డ వద్దు అన్న మాట వినగానే నా కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయాను. అందుకే నేను ఏం చేస్తున్నానో మర్చిపోయి ప్రవర్తించాను.

Continues below advertisement

కళ్యాణ్‌: లేదు అన్నయ్య కోపం కాదు.. బాధ వదిన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోలేకపోతున్నాను అనే బాధ. ఈ కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా అన్నయ్య.. మనకు ఇష్టమైంది మనకు దూరం అవుతున్నా మనం ఏమీ చేయలేనప్పుడు.. ఇప్పటికైనా ప్రాక్టికల్‌ గా ఆలోచించు అన్నయ్య వదినకు అబార్షన్‌ చేయించు..

రాజ్‌: అంటే నా బిడ్డను నేను చంపించాలి అంటున్నావా..? కళ్యాణ్‌   

కళ్యాణ్‌: వదిననైనా కాపాడమంటున్నాను అన్నయ్య..

రాజ్‌: లేదురా నేను ఒక తండ్రిగా నేను అలాంటి పని చేయలేను నా వల్ల కాదు నాకు ఇద్దరూ కావాలి.

కళ్యాణ్‌: అన్నయ్య వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటే చూడాలని నాకు కూడా ఉంది. కానీ అది జరిగే అవకాశం లేదు కదా..?

రాజ్‌:  ఎందుకు లేదురా ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది అంటారు కదా వెతుకుదాం కచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది.

కళ్యాణ్‌: లేదు అన్నయ్యా అన్ని దారులు మూసుకుపోయాయి.. మనకు వదినకు అబార్షన్‌ చేయించడం తప్పా మనకు ఇంకో చాన్స్‌ లేదు అన్నయ్య. ఇక డాక్టర్‌ చెప్పిన మార్గం తప్ప వేరే మార్గం లేదు మనకు.. నువ్వు బాగా ఆలోచించు అన్నయ్య ఏదో ఒక నిర్ణయం తీసుకో..

అంటూ కళ్యాణ్‌ చెప్పగానే రాజ్‌ ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు రూంలో రుద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాహుల్‌ వస్తాడు.

రాహుల్‌: ఏంటి మామ్‌ అంత డీప్‌గా ఆలోచిస్తున్నావు. ఎవరి గురించి

రుద్రాణి: ఇంకెవరి గురించి రాహుల్‌ ఆ రాజ్‌ గురించే

రాహుల్‌: రాజ్‌ గురించా.. ఇప్పుడు వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది

రుద్రాణి: అవసరం ఉంది రాహుల్‌.. ఇంట్లో ఎవరైనా అన్నయ్యను ఒక్క మాట అన్న ఊరుకోని రాజ్‌ ఇవాళ వాడే అంతలా తిట్టడం ఏంటని

రాహుల్‌: మనం ఆలోచించాల్సింది రాజ్‌ గురించి కాదు మామ్‌.. వాడి గుప్పిట్లో ఉన్న ఈ ఆస్థి గురించి

రుద్రాణి: ఏమంటున్నావు రాహుల్‌

రాహుల్‌: అవును మామ్‌ నువ్వు ఎప్పుడూ అంటుంటావు కదా..? నన్నుఈ ఇంటికి వారసుణ్ని చేస్తానని ఆ క్షణం వచ్చేసింది అనిపిస్తుంది.  ఈ సిచ్యుయేషన్‌ను మనం కరెక్టుగా వాడుకుంటే ఈ ఇంటికి ఆ కంపెనీకి ఇక వారసుణ్ని నేనే. రాజ్‌ ఎందుకలా బిహేవ్‌ చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ రాజ్‌కు ఇప్పుడున్న మూడ్‌లో ఆఫీసుకు వెళ్లడం కుదరదు. కావ్య ప్రెగ్నెంట్‌ కావడంతో ఆఫీసుకు వెళ్లదు. అందుకే రాజ్‌ను ఇప్పుడు కన్వీన్స్‌ చేయోచ్చు..

రుద్రాణి: రాహుల్ ఇది నువ్వేనా..?

రాహుల్‌: ఏంటి మమ్మీ అలా అడుగుతున్నావు..

రుద్రాణి: ఏం లేదురా వరదలోకి బురద వచ్చి చేరినట్టుగా నీ బుర్రలోకి సడెన్‌ గా ఇంత తెలివి ఎలా వచ్చిందా అని..

రాహుల్:  నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు  కదాని నేనే ఆలోచించడం మొదలుపెట్టేశాను

అంటూ మామ్‌ నువ్వు రావొద్దు నేనే రాజ్‌ దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి అడుగుతాను అంటూ రాహుల్.. రాజ్‌ దగ్గరకు వెళ్లి అడగ్గానే రాజ్‌ తిడతాడు. ఏ అర్హత ఉందని అడుగుతున్నావని అంటాడు. ఇంతలో రుద్రాణి వచ్చి రాజ్‌ను తిడుతుంది. ఇందిరాదేవి వచ్చి రుద్రాణిని తిట్టి పంపిస్తుంది. తర్వాత రాజ్‌ రూంలోకి వెళ్లి నిద్రపోతున్న కావ్య దగ్గర కూర్చుని ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!