Pulsar Bike Discounts Andhra Telangana: బజాజ్ ఆటో, తన అత్యంత పాపులర్ బైక్‌లలో ఒకటైన పల్సర్ సిరీస్‌కు ప్రత్యేకంగా "హ్యాట్రిక్ ఆఫర్" (Bajaj Pulsar Hattrick scheme) ప్రకటించింది. ఈ ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ అందిస్తోంది, ఇది లిమిటెడ్ పీరియడ్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపురా, అస్సాం రాష్ట్రాల్లోనూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
హ్యాట్రిక్ ఆఫర్‌లో మూడు రకాల లాభాలు
బజాజ్ ప్రకటించిన ఈ పథకంలో కస్టమర్లు రూ. 10,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఆఫర్‌లో మూడు రకాల లాభాలు ఉన్నాయి.
క్యాష్‌బ్యాక్ ఆఫర్: ఎంట్రీ లెవెల్ పల్సర్ మోడళ్లపై రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ప్రీమియం మోడళ్లైన పల్సర్ NS200, NS160 పై మాత్రం రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ అందుతుంది.
ఇన్సూరెన్స్ సేవింగ్: బైక్ కొనుగోలు సమయంలో ఇన్సూరెన్స్ ఖర్చుల్లో తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది.
జీరో ప్రాసెసింగ్ ఫీ: సెలెక్ట్ ఫైనాన్సింగ్ స్కీమ్స్ ద్వారా బైక్ కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఆకర్షణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ ఆఫర్ దసరా పండుగ కోసం ప్రారంభమైంది. పండుగ సీజన్‌లో కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా యువత, మోస్ట్ పాపులర్ పల్సర్ సిరీస్‌ను ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో...
| రాష్ట్రం | పల్సర్ మోడల్ | ఎక్స్-షోరూమ్ ధర | క్యాష్ బ్యాక్ |
| ఆంధ్రప్రదేశ్ | 125 Carbon Fibre | రూ. 93,613 | రూ. 4,000 |
| NS125 | రూ. 99,994 | రూ. 2,500 | |
| 150 Single Disc | రూ. 1,12,659 | రూ. 3,000 | |
| NS160 | రూ. 1,30,483 | రూ. 5,000 | |
| NS200 | రూ. 1,42,502 | రూ. 5,000 |
తెలంగాణలో...
| రాష్ట్రం | పల్సర్ మోడల్ | ఎక్స్-షోరూమ్ ధర | క్యాష్ బ్యాక్ |
| తెలంగాణ | 125 Carbon Fibre | రూ. 93,613 | రూ. 4,000 |
| NS125 | రూ. 99,994 | రూ. 2,500 | |
| 150 Single Disc | రూ. 1,12,659 | రూ. 3,000 | |
| NS160 | రూ. 1,30,675 | రూ. 5,000 | |
| NS200 | రూ. 1,42,893 | రూ. 5,000 |
రీజనల్ మార్కెట్లలో ప్రమోషన్
ఈ హ్యాట్రిక్ ఆఫర్‌ను, బజాజ్ ఆటో, వివిధ రాష్ట్రాల్లో పండుగల సందర్భానికి అనుగుణంగా అమలు చేస్తోంది. మహారాష్ట్రలో గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే, గుజరాత్‌లో నవరాత్రి సందర్భంగా, పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజకు అనుగుణంగా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దసరా పండుగకు ఈ ఆఫర్‌ను ప్రారంభించింది.
ఆఫర్ ఎప్పటి వరకు?
బజాజ్, ఈ ఆఫర్‌కు ముగింపు తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది పూర్తిగా పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన స్కీం కావడంతో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కొనసాగుతుందని అంచనా. కాబట్టి ఈ సమయంలో బైక్ కొనుగోలు చేసేవారికి మంచి లాభం దక్కుతుంది.
కొనేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన విషయం
ఈ ఆఫర్ షరతులు, నిబంధనలు రాష్ట్రాన్ని బట్టి, మోడల్‌ను బట్టి ఒక్కోలా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మీరు బజాజ్ హ్యాట్రిక్ స్కీమ్ కింద బైక్ కొనాలనుకుంటే, మీ సమీపంలోని బజాజ్ షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.