Tata Punch EV Price, Range And Features In Telugu: టాటా బ్రాండ్‌లో బాగా అమ్ముడవుతున్న & బడ్జెట్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV ఇప్పుడు మరింత మారిపోయింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ & అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కస్టమర్లను కట్టిపడేసిన పంచ్ EV, రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు, కంపెనీ, ఈ EVలో ఛార్జింగ్ వేగాన్ని కూడా పెంచింది. దీంతో ఈ కారు మునుపటి కంటే మరింత ప్రాక్టికల్ ఆప్షన్‌గా మారింది.
కొత్త కలర్స్‌తో పెరిగిన స్టైల్‌పంచ్ EV లో ఇప్పుడు ప్యూర్ గ్రే (Pure Grey) & సూపర్‌నోవా కాపర్ (Supernova Copper) కలర్స్ యాడ్ అయ్యాయి. ఈ రెండు కొత్త షేడ్స్ జోడించిన తర్వాత, ఈ కారు ఇప్పుడు మొత్తం ఏడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు ఎంపవర్డ్ ఆక్సైడ్, సీవీడ్, ఫియర్‌లెస్ రెడ్, డేటోనా గ్రే & ప్రిస్టైన్ వైట్ రంగులు ఉన్నాయి. ఈ రంగులన్నీ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్-టోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉండడం ఈ కారు ప్రత్యేకత, ఇది కారు స్టైల్‌ను మరింత ప్రీమియం అప్పీల్‌లోకి మారుస్తుంది.
గతంలో కంటే వేగంగా ఛార్జింగ్కొత్త అప్‌డేట్‌తో, పంచ్ EV DC ఫాస్ట్ ఛార్జింగ్ వేగం మెరుగుపడింది. గతంలో, 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయడానికి 56 నిమిషాలు పట్టేది. ఇప్పుడు ఈ పని కేవలం 40 నిమిషాల్లోనే పూర్తవుతుంది. అంతేకాదు, ఇప్పుడు ఈ కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌లో దాదాపు 90 కి.మీ. దూరాన్ని కవర్ చేయగలదు. అంటే, ప్రయాణ సమయంలో ఎక్కడైనా ఆగి కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేసుకుంటే చాలు, దాదాపు 90 కిలోమీటర్ల దూరం వెళ్లిపోవచ్చు.
టాటా పంచ్ ఈవీ ఫీచర్లుటాటా పంచ్ EV స్టైలిష్‌గా ఉండటమే కాదు, పూర్తిగా సాంకేతికతతో నిండి ఉంది. క్యాబిన్‌లో 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్ (ఇన్ఫోటైన్మెంట్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం) ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకి ఇది సపోర్ట్ చేస్తుంది. రియర్ AC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ & 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌ను కూడా ఈ కారుతో పాటు వస్తాయి. ప్రయాణీకుల సౌకర్యం కోసం వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ & సింగిల్-పేన్ సన్‌రూఫ్ వంటివి ఈ కారులో చూడవచ్చు.
సేఫ్టీ ఫీచర్లుటాటా పంచ్ EV భద్రత పరంగా కూడా చాలా ముందుంది. ఆరు ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హిల్ హోల్డ్ కంట్రోల్ & హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ దీనిని ఈ విభాగంలో అత్యంత సురక్షితమైన & అత్యంత విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మార్చాయి.