Smart Fridge : కాలానికి, మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు మారుతూ.. కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది. మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వీటి వల్ల వాటిని వినియోగం, సామర్థ్యం కూడా మెరుగైంది. ఫ్రిజ్ కూడా అలాంటి ఎలక్ట్రానికి వస్తుపుల్లో భాగమైపోయింది. కేవలం ఆహారాన్ని నిల్వ చేసే ప్రదేశంగా మాత్రమే కాకుండా.. ఇంటికి మంచి లుక్​ని ఇచ్చేలా సరికొత్త ఫీచర్లతో వీటిని రూపొందిస్తున్నారు. అలాగే అద్భుతమైన ఫీచర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే మీరు కొత్త ఫ్రిడ్జ్ కొనాలని చూస్తుంటే..  ఈ ముఖ్యమైన ఫీచర్లను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. ఆ ఫీచర్లతో కలిగే లాభామేంటో ఇప్పుడు చూసేద్దాం.





ఇన్వర్టర్ కంప్రెసర్


ఈ రోజుల్లో ఫ్రిడ్జ్​లలో ఇన్వర్టర్ కంప్రెసర్ అందుబాటులోకి వస్తోంది. ఇది అవసరానికి అనుగుణంగా ఫ్రిడ్జ్​లో శీతలీకరణను సర్దుబాటు చేస్తుంది. అంటే.. ఫ్రిజ్‌లో తక్కువ వస్తువులు ఉంటే.. దానంతటా అదే కూలింగ్​ని సెట్ చేసుకుని తగ్గిస్తుంది. దీనివల్ల విద్యుత్తు ఆదా అవుతుంది. దీనివల్ల ఫ్రిజ్ కూడా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఆహారం కూడా చెడిపోకుండా ఉంటుంది.


ఫ్రెష్​నెస్ ఫీచర్


కొన్ని ఫ్రిడ్జ్​లలో హైబ్రీడ్ శీతలీకరణ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. అలాగే లోపల ఆహారాన్ని పాడుకాకుండా కాపాడుతుంది. దీనితో పాటు తేమను కంట్రోల్ చేసి.. యాంటీ బాక్టీరియల్ గాస్కెట్‌లు వంటివి ఫ్రిజ్ లోపల శుభ్రంగా ఉంచేలా చేస్తుంది. దీనివల్ల లోపల ఉంచిన పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.


స్మార్ట్ ఇంటిగ్రేషన్


ఈ రోజుల్లో చాలా ఫ్రిజ్‌లు కనెక్టివిటీ ఫీచర్లతో వస్తున్నాయి. Wi-Fiతో అమర్చిన ఈ ఫ్రిజ్‌ల సెట్టింగ్‌లను మొబైల్ ద్వారా నియంత్రించవచ్చు. అయితే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ వర్త్. ఇంటిగ్రేటెడ్ కెమెరా ఉన్న ఫ్రిడ్జ్​ వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారునికి అలెర్ట్స్ పంపిస్తుంది.


ఫ్లెక్సిబుల్ స్టోరేజ్ డిజైన్


ఈ రోజుల్లో చాలా కంపెనీలు ఫ్రిడ్జ్​లో మార్చుకోగలిగే కంపార్ట్‌మెంట్‌లను అందిస్తున్నాయి. అంటే మీ అవసరానికి అనుగుణంగా  ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌గా ఉపయోగించవచ్చు. స్లైడింగ్ ట్రేలు లేదా ఫ్లెక్సిబుల్ స్టోరేజ్ డిజైన్ మరింత అనుకూలంగా ఉంటుంది.


ఎనర్జీ సామర్థ్యం


ఫ్రిజ్ సహా ఏదైనా ఎలక్ట్రానిక్స్ వస్తువును కొనుగోలు చేసేటప్పుడు.. దాని ఎనర్జీ, స్టార్ రేటింగ్‌ను చూడటం ముఖ్యం. రేటింగ్‌లో ఎన్ని ఎక్కువ నక్షత్రాలు ఉంటే.. ఆ ఉపకరణం అంత తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. 4 లేదా 5 ఎనర్జీ స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలు దీర్ఘకాలంలో మీ విద్యుత్ బిల్లును బాగా తగ్గించగలవు.