Bajaj Auto Price Cut: బజాజ్ ఆటో ఈ సంవత్సరం మార్కెట్‌లో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్ 125ని విడుదల చేసింది. బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125, పల్సర్ ధరలను తగ్గించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిని ఆటోమేకర్లు ఖండించారు. ఓ బ్రోకరేజీ సంస్థ ఇచ్చిన సమాచారం తప్పు అని బజాజ్ కంపెనీ పేర్కొంది.
ధరను తగ్గించింది ఇప్పుడు కాదంట...
మోటార్‌సైకిల్ ధర తగ్గింపుపై మార్కెట్‌లో పుకార్లు వచ్చినా అది తప్పని బజాజ్ ఆటో తెలిపింది. 2024 అక్టోబర్‌లో కంపెనీ బైక్ ధరను తగ్గించింది. ప్రస్తుతం ఈ సీఎన్‌జీ బైక్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఫ్రీడమ్ 125 టాప్ మోడల్ ధర రూ.1,10,000గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ ధర లేదా ఫీచర్లలో ఎలాంటి మార్పు చేయలేదని బజాజ్ ఆటో తెలిపింది. ఈ వేరియంట్ అమ్మకాలు సీఎన్‌జీ బైక్‌ల అమ్మకాలలో 72 శాతం ఉన్నాయి.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
బజాజ్ ఫ్రీడమ్ 125 బేస్ వేరియంట్ కూడా 13 శాతం అమ్ముడైంది. 2024 అక్టోబర్‌లో కంపెనీ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరను మార్చింది. ఈ మోడల్ ధర రూ.95 నుంచి రూ.90 వేలకు తగ్గించారు. ఈ వేరియంట్ ధరను తగ్గించడానికి కారణం మరింత మంది కస్టమర్లను ఆకర్షించడమే. దేశంలోని మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ మిడ్ వేరియంట్ 15 శాతం వరకు అమ్మకాలను సాధించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ వేరియంట్ ధర రూ.95,000గా ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ 125
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. బైక్‌లోని ఈ ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 9.5 పీఎస్ పవర్‌ని, 5,000 ఆర్పీఎం వద్ద 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఒకేసారి రెండు కిలోల వరకు సీఎన్‌జీ నింపవచ్చు. దీని కారణంగా ఈ మోటార్‌సైకిల్ ఏకంగా 200 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుందని పేర్కొంది.
అవసరమైతే ఈ బజాజ్ బైక్‌ను పెట్రోల్ మోడ్‌లో కూడా నడపవచ్చు. ఈ మోటార్‌సైకిల్‌కు రెండు లీటర్ల వరకు పెట్రోల్ నింపుకునే సామర్థ్యం ఉంది. ఈ బైక్ పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. బజాజ్ ఫ్రీడమ్ 125 ఎక్స్ షోరూమ్ ధర రూ. 89,997 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!