Google will give skill training to AP youth: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Also Read: పుష్ప 2లో గంగమ్మ జాతర సీన్‌తో ఫ్యాన్స్ పూనకాలు- ఇంతకీ ఈ వేడుకలో లేడీ గెటప్‌కి ఎందుకంత ప్రాధాన్యత!
దీంతోపాటు స్టార్టప్ లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఎఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి కీలకమైన అంశాల్లో ఎఐ&ఎంఎల్ సొల్యూషన్స్ ను ఏకీకృతం చేయడానికి గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుంది. AI ఆధారిత వ్యవస్థలో ఆర్థిక వృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణ, వనరులను యువతకు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. ఎఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది.
ఇటీవల ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు మెటాతో ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ ద్వారా ప్రజలకు 100 పౌర సేవలను అందించనుంది. ప్రజలకు ఇప్పుడు నిత్యావసర సరుకులు నుంచి షాపింగ్ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు. దాదాపు స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు అంతా వాట్సాప్ వాడుతున్నారు. తాజాగా ఏపీ సర్కార్ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు పలు సేవలందించే ఆలోచనలో ఉంది. ఇకపై రాష్ట్రంలో పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది.