Bajaj First CNG Bike To Launch on July 17.. Photos Leaked : బ‌జాజ్ ఆటో ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సారిగా CNG బైక్ లాంచ్ చేయ‌నుంది. జూన్ నాటికి బైక్ ని మార్కెట్ లోకి తీసుకొస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ లాంచింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. జులై 17న మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ బైక్ కి సంబంధించి కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్ట్ డ్రైవ్ చేస్తుండ‌గా దీనికి సంబంధించి ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇప్ప‌టికే త్రీ వీల‌ర్స్, ఫోర్ వీల‌ర్స్ CNG బండ్లు మార్కెట్ లో ఉన్న‌ప్ప‌టికీ టూ వీల‌ర్ రావ‌డం ఇదే మొద‌టిసారి.


మోడ‌ల్ ఎలా ఉండంటే? 


లీకైన ఫొటోల్లో బండి చాలా అంటే చాలా స్టైలిష్ గా క‌నిపించింది. డీసెంట్ గా ఉంది. బండి మొత్తం క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంది. కొన్ని డిజైన్లు మాత్ర‌మే బ‌య‌టికి క‌నిపిస్తున్నాయి. ఫుల్ ఎల్ ఈడీ హెడ్ లైట్స్ తో మార్కెట్ లోకి రానుంది బ‌జాజ్ CNG బండి. ఇక ఈ బండిలో కేవ‌లం CNG మాత్ర‌మే కాదు పెట్రోల్ ఆప్ష‌న్ కూడా ఉంటుంది. CNG ట్యాంక్ ని కూడా స్లోప‌ర్ ఇంజిన్ డిజైన్ తో ఏర్పాటు చేశార‌ట‌. దాంతో బండి బాగా స్పేయిష్ గా అనిపిస్తుంది. ఈ CNG బైక్ 125 సీసీ క‌మ్యూట‌ర్ ఇంజిన్ తో వ‌స్తోంది. ఐదు స్పీడ్ గేర్ బాక్సులు ఉన్నాయి. 


CNG ట్యాంక్ వాల్వ్‌ను యాక్సెస్ చేసేందుకు ఫ్యూయ‌ల్ ట్యాంక్ లో పెద్ద ప్యానెల్ ని అమ‌ర్చారు. అది లీడ్ లాగా తెరుచుకుంటుది. ఈ బైక్ లో పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది.  గ్యాస్ అయిపోయిన‌ప్పుడు.. పెట్రోల్‌తో బండిని న‌డ‌పొచ్చు. ఎడ‌మ వైపు స్విచ్ గేర్ కి బ్లూ స్విచ్ ఇచ్చారు. అది నొక్కితే ఫ్యూయ‌ల్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ఇక మైలేజీ విషయానికి వస్తే.. పెట్రోల్‌ బండి కంటే డబుల్ ఉంటుందట. పెట్రోల్ బండికి అయ్యే ఖర్చుతో పోల్చితే.. దీనికి సగమే ఖర్చవుతుందని బ‌జాజ్ ఆటో సీఈవో రాజీవ్ బ‌జాజ్ ఇటీవల వెల్లడించారు.


ఇక ఈ బైక్ కి బ‌జాజ్ బ్రూజ‌ర్ అనే పేరు పెట్టారు. ఈ బైక్ లో టెయిల్ పైప్ ఎమిష‌న్స్ ను త‌గ్గించారు. అంతేకాకుండా కార్బ‌న్ డ‌యాక్సైడ్ వెలువ‌డటం కూడా 50 శాతం త‌గ్గుతుంద‌ట. బజాజ్ సీఎన్‌జీ మోడల్ లో రెండో స్టోరేజ్ సిలిండర్ కూడా ఉంటుంది. దీని రేట్ మామూలు బండి కంటే.. ఎక్కువ ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.80,000 (ex-showroom) ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.


ప్ర‌స్తుతం పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతేకాకుండా ఆ బండ్ల వ‌ల్ల పొల్యూష‌న్ కూడా ఎక్కువ అవుతున్న త‌రుణంలో అంద‌రూ ఎల‌క్ట్రిక్ బండ్లపై ఆధార‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మార్కెట్ లో ఎల‌క్ట్రిక్ బండ్లు చాలా వ‌చ్చాయి. CNG కార్లు, ఆటోలు ఉండ‌గా.. బండ్లు రావ‌డం ఇదే మొద‌టిసారి. దీంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. 


Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూప‌ర్ - భార‌త్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?