Bajaj Chetak C25 Review: Bajaj Auto, తన ఎలక్ట్రిక్‌ లైన్‌అప్‌లో కొత్త ఎంట్రీ లెవల్‌ మోడల్‌గా Bajaj Chetak C25 ను ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ₹91,399 (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో వచ్చిన ఈ స్కూటర్‌ను 3001 లేదా 35 సిరీస్‌లతో ఎలాంటి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. మరి, ఈ స్కూటర్‌ను కొనవచ్చా? లేక వేరే ఆప్షన్‌ చూసుకోవాలా?.

Continues below advertisement

కొనడానికి 3 బలమైన కారణాలు

1) సిటీల్లో సరిపోయే పవర్‌ఫుల్‌ యాక్సిలరేషన్‌

Continues below advertisement

పేపర్‌పై చూసుకుంటే, C25 పవర్‌ ఫిగర్లు సాధారణంగానే అనిపిస్తాయి. 2.2kW పీక్‌ పవర్‌, 1.8kW కంటిన్యూయస్‌ అవుట్‌పుట్‌తో వచ్చే ఈ హబ్‌ మోటర్‌, సిటీ ట్రాఫిక్‌లో మాత్రం బాగా సరిపోతుంది. థ్రాటిల్‌ను ట్యూనింగ్‌ చక్కగా చేశారు. సిగ్నల్‌ దగ్గర నుంచి స్కూటర్‌ స్మూత్‌గా ముందుకు కదులుతుంది. 50 km వేగం వరకు త్వరగా చేరుతుంది. గరిష్టంగా సుమారు 62-63 km వేగం అందుకుంటుంది. రోజువారీ ఆఫీస్‌ లేదా కాలేజ్‌ ప్రయాణాలకు ఇది సరిపోతుంది.

2) ఆకర్షణీయమైన ధర

₹91,399 (ఎక్స్‌-షోరూమ్‌)తో ప్రస్తుతం బజాజ్‌ చేతక్‌ రేంజ్‌లోనే ఇది అత్యంత తక్కువ ధర మోడల్‌. మెటల్‌ బాడీ ప్యానెల్స్‌ ఈ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణ. చాలా ఈవీ స్కూటర్లలో ప్లాస్టిక్‌ ఎక్కువగా ఉంటే, C25లో మెటల్‌ బాడీ ఉండటం వల్ల దృఢత్వం, లగ్జరీ ఫీల్‌ రెండూ కలుస్తాయి. TecPac తీసుకుంటే ధర ₹94,399 (ఎక్స్‌-షోరూమ్‌)కు చేరుతుంది. అయినా కూడా మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్లతో పోలిస్తే ఇది పోటీ ధరే.

3) డిజైన్‌ & క్వాలిటీ

చేతక్‌ అంటే ఒక క్లాసిక్‌ గుర్తు. అదే డిజైన్‌ను C25లో కూడా కొనసాగించారు. అయితే సైడ్‌, రియర్‌ ప్యానెల్స్‌ కొత్తగా డిజైన్‌ చేశారు. క్వాలిటీ కూడా ధరకు తగ్గట్టు బాగానే ఉంటుంది. ఎంట్రీ లెవల్‌ అయినా కూడా మరీ చవకగా అనిపించదు.

వదిలేయడానికి 2 కారణాలు

1) గుంతల రోడ్లపై ఫ్రంట్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌, విజయవాడ సహా మన తెలుగు నగరాల్లో రోడ్లపై గుంతలు ఉడడం కొత్త విషయం కాదు. అలాంటి రోడ్లపై ఫ్రంట్‌ సస్పెన్షన్‌ కొంచెం సాఫ్ట్‌గా అనిపిస్తుంది. కాస్త పెద్ద గుంతలోకి దిగితే చిన్నగా ‘తడ్‌’ అనే శబ్దం వినిపిస్తుంది. ఇది పెద్ద లోపం కాదు కానీ వేగం తగ్గించాల్సి వస్తుంది.

2) తక్కువ టాప్‌ స్పీడ్‌

అఫిషియల్‌గా టాప్‌ స్పీడ్‌ 55 km. TecPac తీసుకుంటే Eco మోడ్‌లో 45 kmకి పరిమితం అవుతుంది, ఇది సిటీ సరిపోతుంది. కానీ ఫాస్ట్‌ అర్బన్‌ రోడ్లపై లేదా అప్పుడప్పుడు హైవేపై వెళ్లాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ టాప్‌ స్పీడ్‌ ఉంటే బాగుండేది.

హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర వివరాలు

ఎక్స్‌-షోరూమ్‌ ధర: ₹91,399

RTO: ₹1,500

ఇన్సూరెన్స్‌ (Comprehensive): ₹5,058

క్యాష్‌ డిస్కౌంట్‌: - ₹4,299

హైదరాబాద్‌లో ఆన్‌ రోడ్‌ ధర: ₹93,658

వరంగల్‌, విజయవాడ, విశాఖ సహా తెలుగు నగరాన్నింటిలో స్వల్ప మార్పులతో దాదాపు ఇదే ఆన్‌ రోడ్‌ రేటు ఉంటుంది.

సిటీ ప్రయాణాలకు బడ్జెట్‌లో మెటల్‌ బాడీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కావాలంటే Bajaj Chetak C25 ఒక మంచి ఆప్షన్‌. ఎక్కువ వేగం, ఎక్కువ పవర్‌ కోరుకునే వారు మాత్రం మరో మోడల్‌ చూడడం మంచిది. మీరు సిటీలోనే ఎక్కువ తిరగాలనుకుంటే ఈ స్కూటర్‌ నిరాశపరచదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.