Aishwarya Arjun Seetha Payanam Movie Collections: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్యర్య అర్జున్ నటించిన సినిమా 'సీతా పయనం'. ఇదొక రోడ్ జర్నీ సినిమా. ప్రయాణంలో కుటుంబ విలువలు, దేశభక్తి, గో సంరక్షణ వంటి అంశాలు జోడించారు అర్జున్. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేశారు. మొదటి రోజు సినిమాకు భారీ స్పందన ఏమీ రాలేదు. ఫస్ట్ డే కలెక్షన్ 50 లక్షలు కూడా దాటలేదు. మరి రెండో రోజు ఎలా ఉంది? మొదటి రోజుతో కంపేర్ చేస్తే దారుణంగా ఏమీ పడలేదు. అలా అని ఈ కలెక్షన్స్ సరిపోతాయా? అనేది ప్రశ్న. 

ఇండియాలో రెండు రోజుల నెట్ ఎంతంటే?Seetha Payanam Two Days India Net Collection: హిందీ కాకుండా నాలుగు దక్షిణాది భాషల్లో 'సీతా పయనం' సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. నిజానికి పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ నార్త్ ఇండియాలో సినిమాకు సరైన ఆదరణ లభించడం లేదు. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ మీద ఒక లుక్ వేస్తే...

Also ReadTheatrical Releases This Week: తెలుగులో సుహాస్ & శివ కందుకూరికి... హిందీలో మృణాల్ & తాప్సీకి కాంపిటీషన్ లేదుగా... థియేటర్లలో ఈ వారం రిలీజయ్యే సినిమాల లిస్ట్

  • కన్నడలో మొదటి రోజు 11 లక్షల రూపాయల నెట్ వచ్చింది. రెండో రోజు 9 లక్షల నెట్ కలెక్ట్ చేసింది. దాంతో రెండు రోజుల నెట్ 20 లక్షలకు చేరుకుంది.
  • తెలుగులో మొదటి రోజు 16 లక్షల నెట్ కలెక్ట్ చేసింది 'సీతా పయనం'. సర్‌ప్రైజ్ ఏమిటంటే... రెండో రోజు 2 లక్షల కలెక్షన్ పెరిగింది. ఆదివారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 18 లక్షల నెట్ వచ్చింది. దాంతో రెండు రోజుల వసూళ్లు 34 లక్షలకు చేరింది.
  • తమిళ, మలయాళ భాషల్లో 'సీతా పయనం' కలెక్షన్లలో మార్పు లేదు. తమిళనాట శని, ఆది వారాల్లో ఐదేసి లక్షల నెట్ వచ్చింది. మలయాళంలో మొదటి రోజు కోటి, రెండో రోజు కోటి వచ్చింది.
  • దక్షిణాది భాషల్లో 'సీతా పయనం' రెండు రోజుల నెట్ కలెక్షన్ చూస్తే... 66 లక్షలకు చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 74 లక్షలు అని టాక్.

Also ReadOTT Releases This Week: రవితేజ BMWపై సస్పెన్స్... ఓటీటీలో ఈ వారం 15 సినిమాలు, కొత్త వెబ్ సిరీస్‌లు - సందడి అంతా వీటిదే

'సీతా పయనం'తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఐశ్వర్య అర్జున్ కథానాయికగా పరిచయం అయ్యారు. కన్నడలో కొన్ని సినిమాలు చేసిన రియల్ స్టార్ ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, బిత్తిరి సత్తి కీలక పాత్రలు చేశారు. అర్జున్ సర్జా, ఆయన మేనల్లుడు ధృవ్ సర్జా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Also Read: Funky Box Office Collection: ఫంకీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్... ఆదివారం పడిందా? పైకి లేచిందా?