MeghasandesamSerial Today Episode: గగన్‌, శరత్‌ చంద్రల ఫ్యామిలీలు రెండు గుడిలో ఎదురుపడతాయి. ఒకరినొకరు చంపుకునేంతగా చూసుకుంటారు. తర్వాత ఎవరికి వారు గుడిలోకి వెళ్లిపోతారు. తర్వాత శివ వెళ్లి బిందుకు హియర రింగ్స్‌ ఇస్తాడు.

బిందు: నువ్వే పెట్టు శివ

అనగానే శివ పెడుతుంటాడు. అప్పుడే అటువైపు అపూర్వ, సుజాత వస్తారు. సుజాత వాళ్లను చూస్తుంది.

సుజాత: అమ్మాయి ఎమిటీ విడ్డూరం.. అమ్మాయి మన బిందు ఎవరో అబ్బాయితో చాలా క్లోజ్‌గా మాట్లాడుతుంది.

అపూర్వ: ఎక్కడ..?

సుజాత: అదిగో అక్కడ

అనగానే అపూర్వ అక్కడ చూస్తుంది. అక్కడ బిందు ఒక్కతే ఉంటుంది.

అపూర్వ: ఒక్కతే ఉంది కదా..?

సుజాత: అమ్మాయి నేను చూసినప్పుడు ఇద్దరు ఉన్నారు అమ్మాయి..

అపూర్వ: అవునా..?

సుజాత: అవును అమ్మాయి..

అపూర్వ: సరే పదా దాని సంగతి చూద్దాం..

అనుకుంటూ ఇద్దరూ కలిసి బిందు దగ్గరకు వెళ్తుంటారు. బిందు భయపడుతుంది.

అపూర్వ: దండం పెట్టుకుంది చాలు ఇప్పటి దాకా నీతో మాట్లాడిన వాడు ఎక్కడున్నాడు..? ఎక్కడ..?

బిందు: నా దగ్గరా..? నా దగ్గర ఎవరున్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అత్తయ్యా..?

సుజాత: లేదు అమ్మాయి ఇది అబద్దం చెప్తుంది.

బిందు: అంత అవసరం నాకేం ఉంది.

అపూర్వ: నీకే ఉంది. ఆ గుడి దగ్గర మా పక్కనే మొక్కకున్న నువ్వు సడెన్‌గా ఇక్కడ ఎందుకు ప్రత్యక్షం అయ్యావు..

బిందు: అది ఈ దేవతకు మొక్కుకుంటే చదువు బాగా వస్తుందని నా ఫ్రెండ్‌ చెప్పింది అందుకే ఇక్కడకు వచ్చాను.

సుజాత: అమ్మో అమ్మో ఏం అబద్దం ఆడుతుంది అమ్మాయి ఇది.

అపూర్వ: అబద్దాలు బాగానే అలవాటు అయిపోయాయి దీనికి..

బిందు: నేనేం అబద్దం ఆడలేదు..

అపూర్వ: నువ్వు ఆడావు.. ఎంతగా ఆడావు అంటే నీ చెవులకు ఈ కొత్త జూకాలు ఆడుతున్నంత బాగా.. ఎవడు వాడు.

సుజాత: అమ్మాయి ఇంకెవడు ఇచ్చి ఉంటాడు. ప్రేమికుడు ఇచ్చి ఉంటాడు.

బిందు: మీకు నా మీద అనుమానంగా ఉంది కదా..? అందుకే నేనేం చేసినా తప్పు అనిపిస్తుంది. ఈ జుంకాలు నేను ఉదయమే పెట్టుకున్నాను. మీరు నన్ను అనుమానించడం మానేయండి అత్తయ్యా.. తల్లి మా అత్తయ్యకు నా మీద అనుమానం పోయి ముందులా ఉండేలా చేయి తల్లి

అనుకుంటూ దేవతకు మొక్కి బిందు వెళ్లిపోతుంది. చెట్టు చాటు నుంచి చూస్తున్న శివ ఊపిరి పీల్చుకుంటాడు.

శివ: థాంక్యూ బిందు చాలా తెలివిగా బిహేవ్‌ చేశావు. అమ్మో ఆరోజు కొట్టింది ఊహించుకుంటేనే భయం వేస్తుంది.

అనుకుంటూ చూస్తుంటాడు. అపూర్వ, సుజాత అనుమానంగా అటూ ఇటూ చూస్తుంటారు. శివ అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతాడు. తర్వాత గగన్‌ ప్రసాదం తీసుకొచ్చి అందరికీ పంచుతుంటే..

పూర్ణి: ఆగు అన్నయ్యా ఏంటిది..?

గగన్‌: ప్రసాదం ఏం బాగాలేదా..?

పూర్ణి: పొంగల్‌ పులిహోర కలిపి కట్టేయమన్నావా..?

గగన్‌: అవును ఎందుకు అనవసరంగా ఆకులు వేస్ట్‌ అని కలిపి కట్టేసి తీసుకొచ్చాను.  ఎందుకు బాగాలేదా..?

పూర్ణి: పొంగల్‌ తిని తియ్యగా ఉందని చెప్పొచ్చు. పులిహోర  తిని పుల్లగా ఉందని చెప్పొచ్చు అన్నయ్య. రెండు కలిపి తిన్నాక అది ఏదోలా ఉంది అది ఏమని చెప్పమంటావు అన్నయ్య అమ్మా ఎలా కన్నావు అమ్మ నీ కొడుకును.. వదిన జీవితాంతం ఎలా భరిస్తావో ఏంటో మీ ఆయన్ని

అనగానే.. గగన్‌ కోపంగా పూర్ణిని కొట్టబోతుంటే.. పూర్ణి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!