Bajaj Auto: భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో... ప్రస్తుతం కొత్త బజాజ్ కమ్యూటర్ బైక్‌ను పరీక్షిస్తోంది. ఈ మోడల్‌ను నిశితంగా పరిశీలిస్తే ఇది కంపెనీ సీటీ లైనప్‌లో రాబోయే మోడల్ కావచ్చని అనిపిస్తుంది. ఈ టెస్టింగ్ మ్యూల్‌లో ఎక్కువ భాగం కవర్‌తో కప్పబడి ఉంది. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పటికీ కనిపించాయి. ఇది సీటీ మోడల్ రూపంలో వస్తుందని తెలుస్తోంది.
డిజైన్ ఇలా ఉంది?
ఇది పెద్ద వృత్తాకార హెడ్‌లైట్, పొడవైన, వెడల్పైన హ్యాండిల్‌బార్‌తో సహా కాస్త విలక్షణమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న సీటీ 125ఎక్స్ తరహాలోనే కంపెనీ గత సంవత్సరం లాంచ్ చేసింది. దీని డిజైన్ చాలా ఆకట్టుకుంటుంది. కొత్త మోడల్‌లో అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి.
కమ్యూటర్ బైక్‌లో హ్యాండ్ గార్డ్‌ల ఉనికి కాస్త కొత్తగా ఉంటుంది. బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ వంటి మోడల్‌లలో కూడా దీనిని మనం చూశాం. సంప్ గార్డ్, బ్రేస్డ్ హ్యాండిల్ బార్ ఈ విభాగంలో సాధారణంగా కనిపించవు. కానీ ఈ లక్షణాలన్నీ సీటీ 125ఎక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అవి ఈ టెస్టింగ్ మ్యూల్‌లో కూడా కనిపించాయి. కాబట్టి రాబోయే సీటీ మోడల్ ప్రివ్యూ అని నిర్ధారించుకోవచ్చు.
Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!
త్వరలో కొత్త పల్సర్ కూడా
ఈ కొత్త మోడల్ కంపెనీ లైనప్‌లో ప్రస్తుతం ఉన్న సీటీ 125ఎక్స్ కంటే పై స్థాయిలో ఉండనుంది. ఇది అల్లాయ్ వీల్స్ కోసం మరింత ప్రీమియం స్ప్లిట్-స్పోక్ డిజైన్‌ను పొందుతుంది. అయినప్పటికీ చిన్న 125తో పోలిస్తే వెనుకవైపు సామాను ర్యాక్ లేదు. దీని కారణంగా ఇది బలమైన సీటీ ప్లాట్‌ఫారమ్ 150 సీసీ రీబ్యాడ్జ్డ్ మోడల్ కావచ్చు. దీన్ని సీటీ 150ఎక్స్ అని పిలుస్తారు.
ఇటీవల బజాజ్ పల్సర్ పీ150ని నిలిపివేసింది. దీని కారణంగా కొత్త ఎన్150, పాత పల్సర్ 150 బైకులు మాత్రమే కంపెనీ 150 సీసీ పల్సర్ సిరీస్‌లో ఉన్నాయి. అందువల్ల బలమైన కమ్యూటర్ మోటార్‌సైకిల్ విభాగంలో కాస్త వెలితి నెలకొంది.
మరోవైపు టాటా మోటార్స్ త్వరలో పంచ్ ఈవీ కారును లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా మార్కెట్లో అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే కాస్త దిగువ స్థాయిలో పంచ్ ఈవీని ఉంచుతుంది. అంతే కాకుండా పంచ్ ఈవీ కారు రెండు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో వస్తుంది. ఇందులో మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ వెర్షన్లు ఉండనున్నాయి. ఇందులో లాంగ్ రేంజ్ అందించే పంచ్ ఈవీ 30 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో రానుందని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 325 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని తెలుస్తోంది.