Ather 450S Electric Scooter: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎస్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 450ఎక్స్ కంటే కొంచెం దిగువ స్థాయిలో ఉంటుంది. అదే సమయంలో దీనికి పోటీ అయిన ఓలా ఎస్1 ఎయిర్ ఇటీవలే లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ కూడా గత వారం ప్రారంభం అయింది.
ధర ఎంత?
సబ్సిడీకి ముందు కంపెనీ ఏథర్ 450ఎస్ ధరను రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది. అయితే ఇది ప్రారంభ ధర అనేది గమనించాలి. భవిష్యత్తులో మరింత పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఏథర్ 450ఎస్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 115 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఏథర్ 450ఎస్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఏథర్ 450ఎక్స్ టాప్ స్పీడ్ కూడా ఇంతే. బ్యాటరీ ప్యాక్ గురించి చెప్పాలంటే ఏథర్ 450ఎస్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ప్రస్తుతం మనదేశంలో ఉన్న ఏథర్ స్కూటర్లలో ఇదే అత్యంత చవకైనది.
ఓలా గత నెలలో తన ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 కోసం బుకింగ్ విండోను ఓపెన్ చేసింది. కొద్దిసేపటి తర్వాత కంపెనీ సీఈవో భవిష్య అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ అప్పటికే 3,000 బుకింగ్‌లను అందుకున్నట్లు తెలియజేశారు. అది కూడా బుకింగ్స్ ప్రారంభం అయిన కొన్ని గంటల్లోనే ఈ ఫీట్‌ను ఓలా ఎస్1 ఎయిర్ సాధించడం విశేషం.
ఓలా ఇప్పటికే తన ఎస్1 వేరియంట్‌ను నిలిపివేసింది. అంటే ఇప్పుడు కంపెనీకి విక్రయించడానికి కేవలం రెండు ఎంట్రీ లెవల్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది తాజాగా లాంచ్ అయిన ఎస్1 ఎయిర్ కాగా, కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కంపెనీ అందించింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పట్టనుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ స్కూటీత అందించగలదు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial