Electric Scooter In India: ఏథర్ 450 రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ అప్‌డేట్ చేసింది. వీటికి కొత్త ఫీచర్లను జోడించడంతో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్‌ను కూడా ఏథర్ మెరుగుపరిచింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అప్‌డేట్ తర్వాత ఈవీ ధర కూడా పెరిగింది. ఏథర్ 450ఎస్ ధర రూ. 1.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో మిడ్ వేరియంట్ 450ఎక్స్ 2.9 ధర రూ.1.47 లక్షలకు, 450ఎక్స్ 3.7 ధర రూ.1.57 లక్షలకు పెరిగింది. 


ఎంత పెరిగింది?
ఏథర్ 450ఎస్ ధర రూ.4,400 వరకు పెరిగింది. ఈ స్కూటర్ 375W ఛార్జర్‌ను పొందుతోంది. ఇది కొంచెం వేగంగా ఛార్జ్ అవుతుంది. మునుపటి మోడల్ 350W యూనిట్ ఛార్జర్‌ను పొందింది. ఏథర్ ఈ-స్కూటర్‌లోని ప్రో ప్యాక్‌లో అనేక ఫీచర్లు చేరాయి.



Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!


ఏథర్ 450ఎక్స్ రెండు వేరియంట్‌లకు మ్యాజిక్ ట్విస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా అందించారు. దీంతో పాటు ఈ EVకి రెండు కొత్త కలర్ ఆప్షన్లు కూడా జోడించారు. ఏథర్ 450ఎక్స్ 2.9 ధర ఎక్కువగా పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.6,400 పెరిగింది. కానీ ఏథర్ లాంచ్ చేసిన ఈ స్కూటర్ ఇప్పుడు 700 కేడబ్ల్యూ ఛార్జర్‌తో అందుబాటులో ఉంది. ఇది స్కూటర్ ఛార్జింగ్ సమయాన్ని ఏకంగా సగానికి తగ్గిస్తుంది.


ఏథర్ 450X 3.7 ధర రెండు వేల రూపాయలు పెరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త ఫీచర్లు, కలర్ వేరియంట్‌లను కూడా చేర్చవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మ్యాజిక్ ట్విస్ట్ లో, హై లెవల్స్ ఉన్నాయి. అయితే 450X 2.9లో మ్యాజిక్ ట్విస్ట్‌ను ఆన్ లేదా ఆఫ్ మాత్రమే చేయగలం.


కొత్త రంగుల్లో ఏథర్ స్కూటర్...
ఏథర్ 450ఎక్స్ హైపర్ శాండ్ కలర్ వేరియంట్‌తో వస్తుంది. అదే సమయంలో ఏథర్ 450ఎస్ హైపర్ శాండ్‌తో పాటు స్టీల్ బ్లూ కలర్‌లో కూడా వచ్చింది. ఏథర్‌కు చెందిన ఈ స్కూటర్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఏథర్ 450ఎక్స్‌కు మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ గట్టి పోటీనిస్తుంది. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.07 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.



Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే - టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?