HYDRA: 'హైడ్రా' దూకుడు మళ్లీ షురూ - మాదాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చివేత

Hyderabad News: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాలపై 'హైడ్రా' చర్యలు చేపట్టింది. 100 ఫీట్ రోడ్డులోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఐదంతస్తుల భవనాన్ని కూల్చేశారు.

Continues below advertisement

HYDRA Demolition Of 5 Storey Building In Ayyappa Society: నగరంలో అక్రమ కట్టడాలపై 'హైడ్రా' (HYDRA) దూకుడు కొనసాగుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని (Ayyappa Society) 100 ఫీట్ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకుని అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో ఆదివారం హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. గతేడాది ఈ భవన యజమానులకు జీహెచ్ఎంసీ నోటీసులిచ్చింది. ఆ తర్వాత హైకోర్టు సైతం ఈ నిర్మాణం అక్రమమని తేల్చింది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) శనివారం ఈ భవనాన్ని పరిశీలించారు.

Continues below advertisement

684 గజాల స్థలంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల్లో భవనం నిర్మాణంలో ఉన్నట్లు గుర్తించారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆదివారం కూల్చివేత చర్యలు చేపట్టారు. భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరా నిలిపేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

'హైడ్రా' కీలక నిర్ణయం

మరోవైపు, హైడ్రా' (HYDRA) కమిషనర్ రంగనాథ్ (Ranganath) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు చేసే ముందు ప్రజలు తగిన ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని సూచించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 040 - 29560596 నెంబర్లను సంప్రదించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Also Read: Adilabad News: తెల్లవారుజామున ఇళ్లల్లో తనిఖీలు - అటవీ అధికారులపై స్థానికుల రాళ్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత

Continues below advertisement